Saturday, November 15, 2025
Homeటెక్నాలజీVivo Y19s 5G Launched:  6000mAh బ్యాటరీతో వివో Y19s 5G వచ్చేసిందోచ్..ధర, ఫీచర్లు ఎలా...

Vivo Y19s 5G Launched:  6000mAh బ్యాటరీతో వివో Y19s 5G వచ్చేసిందోచ్..ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Vivo Y19s 5G: చైనాకి చెందిన ప్రముఖ ఫోన్ బ్రాండ్ వివో కంపెనీ భారతీయ టెక్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. కంపెనీ దీని వివో Y19s 5G పేరిట తీసుకొచ్చింది. ఈ పరికరం  5G కనెక్టివిటీతో 6000mAh బ్యాటరీ,  6.74-అంగుళాల LCD స్క్రీన్‌, ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ 6300 చిప్‌సెట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. చాలారోజుల నుంచి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివో Y19s 5G ధర:
కంపెనీ ఈ వివో Y19s 5G ధరను ఇంకా వెల్లడించనప్పటికీ, కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అలాగే 4GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా, 6GBRAM+128GB ఉన్న హై-ఎండ్ ఆప్షన్ ధర రూ.13,499గా ఉంది. ఈ పరికరం ఇండియాలో రెండు రంగులలో లభిస్తోంది.
వివో Y19s 5G ఫీచర్లు:
డిస్ప్లే
ఈ వివో పరికరం 6.74-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 720×1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ పరికరం 700 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్-సిమ్‌కు మద్దతు ఇస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజీ 
ఈ బడ్జెట్ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పరికరం రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు, ఆరు ఎఫిషియెన్సీ కోర్లతో అమర్చబడి, 2.4GHz పీక్ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ LPDDR4X RAM, 128GB వరకు eMMC5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.
సాఫ్ట్ వేర్ 
ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్15పై నడుస్తుంది.
కెమెరా 
ఈ వివో పరికరం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/2.2), పేర్కొనబడని 0.8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా (f/3.0) ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం..ఈ పరికరం 5-మెగాపిక్సెల్ (f/2.2) సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరం నైట్ మోడ్, పోర్ట్రెయిట్, లైవ్ ఫోటో, స్లో-మో మరియు టైమ్-లాప్స్ వంటి అనేక కెమెరా మోడ్‌లతో కూడా వస్తుంది.
బ్యాటరీ 
ఈ ఫోన్ అత్యంత ముఖ్యమైన ఫీచర్ దీని 6000mAh బడా బ్యాటరీ. దీని ఒకే ఛార్జ్‌పై రోజంతా యూజ్ చేయవచ్చు. కాగా, ఈ బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad