Vivo Y31d Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీని వివో Y31d పేరిట లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కంబోడియా, వియత్నాం సహా ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో సైలెంట్ గా విడుదల అయింది. స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉన్న ఈ పరికరం 4G నెట్‌వర్క్‌లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివో Y31d- ధర, లభ్యత
కంపెనీ ఈ పరికరాన్ని వియత్నాంలో రూ.26,399గా పేర్కొంది. గ్లో వైట్, స్టార్‌లైట్ గ్రే వంటి రెండు రంగుల్లో లభిస్తోన్న వివో Y31d స్మార్ట్ ఫోన్ వివో కంబోడియా, వియత్నాం వెబ్‌సైట్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంది.
also read:idli: జాగ్రత్త..ప్రతిరోజూ ఇడ్లిలు తింటే డేంజరేనట..!
వివో Y31d- ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే, వివో Y31d స్మార్ట్ ఫోన్ లో 6.75 అంగుళాల పెద్ద LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 256 PPI పిక్సెల్ డెన్సిటీ, 1,250 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనివల్ల స్పష్టమైన విజువల్స్, స్మూత్ స్క్రోలింగ్ అనుభూతి లభిస్తుంది. ఈ ఫోన్‌కు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 చిప్‌సెట్ శక్తినిస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి మంచి పనితీరును అందిస్తుంది. అదనంగా 6GB LPDDR4X ర్యామ్‌తో పాటు 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌ను అందించడం వల్ల యాప్‌లు, ఫోటోలు, వీడియోలను సులభంగా నిల్వ చేసుకోవచ్చు.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే..వివో Y31d స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఇది సాధారణ వినియోగానికి సరిపడే నాణ్యతను అందిస్తుంది. కనెక్టివిటీ ఎంపికల పరంగా ఈ ఫోన్ బ్లూటూత్ 5.1, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, USB 2.0, GPS, BeiDou, GLONASS, గెలీలియో, QZSS వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. అలాగే USB OTG సపోర్ట్‌తో పాటు USB టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ వివో ఫోన్ IP68+IP69+IP69+ రేటింగ్‌లతో వస్తుంది. పవర్ కోసం ఇందులో భారీ 7,200mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది.

