Vivo Y500 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన కస్టమర్ల కోసం సరికొత్త పరికరాన్ని విడుదల చేసింది. కంపెనీ కొత్త Y సిరీస్ ఫోన్ చైనాలో వివో Y500 ప్రోను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం మార్కెట్లో విడుదలైన వివో Y300 ప్రోకు సక్సెసర్‌గా వచ్చింది. వివో ఈ కొత్త మోడల్‌లో డిస్‌ప్లే, కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్ వంటి విభాగాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందించింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వివో Y500 ప్రో ధర, లభ్యత
కంపెనీ వివో Y500 ప్రో 8GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర 1,799 యువాన్లు (సుమారు రూ. 22,000)గా పేర్కొంది. అలాగే 8GBRAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ. 25,000)గా, 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ 2,299 యువాన్లు (సుమారు రూ. 28,000)గా, 12GBRAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ. 32,000)గా నిర్ణయించింది. ఈ పరికరం ఆస్పిషియస్ గోల్డ్, లైట్ గ్రీన్, సాఫ్ట్ పింక్, టైటానియం బ్లాక్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్‌కి అందుబాటులో ఉంది. ఇక నవంబర్ 14 నుండి చైనాలో అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
also read:Winter Vegetables: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే..
వివో Y500 ప్రో ఫీచర్లు
డిస్ప్లే:
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K (1,260×2,800 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్ 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
సాఫ్ట్ వేర్:
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16-ఆధారిత ఆరిజిన్ఓఎస్6 పై నడుస్తుంది.
ప్రాసెసర్, స్టోరేజీ:
ఈ ఫోన్ ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పరికరం 12GB వరకు RAM, 512GB వరకు అంతర్నిర్మిత నిల్వను అందిస్తుంది.
కెమెరా:
కెమెరా గురించి మాట్లాడుతూ..వివో Y500 ప్రో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ f/1.88 ఎపర్చర్‌తో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం.. 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
బ్యాటరీ:
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7000mAh బడా బ్యాటరీతో శక్తిని పొందుతుంది. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం హ్యాండ్‌సెట్ IP68+IP69 రేటింగ్ ను కలిగి ఉంది.
కనెక్టివిటీ ఫీచర్లు:
ఈ పరికరం 5G, బ్లూటూత్ 5.4, GPS, A-GPS, Wi-Fi, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.
కొలతలు:
ఈ పరికరం కొలతలు 160.23×74.51×7.81mm. 198 గ్రాముల బరువు.


