Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmart Tv Offer: స్టన్నింగ్ డీల్.. కేవలం రూ.6 వేల లోపే స్మార్ట్ టీవీ..డోంట్ మిస్!

Smart Tv Offer: స్టన్నింగ్ డీల్.. కేవలం రూ.6 వేల లోపే స్మార్ట్ టీవీ..డోంట్ మిస్!

Smart Tv: టెక్నాలజీ ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో టెలివిజన్ యుగం ముగిసింది. ఇప్పుడు స్మార్ట్ టీవీల ట్రెండ్ నడుస్తోంది. వీటిని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడం ద్వారా, ఇష్టమైన ఓటిటీ ప్లాట్‌ఫామ్‌ల నుండి కంటెంట్‌ను సులభంగా చూడవచ్చు. టెలివిజన్ లో లాగా ఎక్కవ యాడ్స్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో బిగ్ స్క్రీన్ టీవీని కొనుగోలు చేయాలంటే, చాలా మంది ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని అనుకుంటారు.

- Advertisement -

కానీ, VW లినక్స్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ HD రెడీ స్మార్ట్ LED టీవీ VW24C3 తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే? దీని రూ.6,000 కంటే తక్కువ ధరకు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ధర విషయానికి వస్తే..VW లినక్స్ ఫ్రేమ్‌లెస్ సిరీస్ HD రెడీ స్మార్ట్ LED టీవీ VW24C3 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ లో కేవలం రూ.5,999కి లిస్ట్ అయింది. వినియోగదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఈ టీవీని కొనుగోలు చేస్తే, దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని వలన ధర మరింత తగ్గుతుంది. అదనంగా దీని పై క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల గురించి మాట్లాడితే..ఈ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీల యాంగిల్ 24-అంగుళాల HD రెడీ (1366×768 పిక్సెల్స్) డిస్‌ప్లేను పొందుతుంది. ఇది 24W స్పీకర్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఐదు సౌండ్ మోడ్‌లను అందిస్తుంది. ఈ టీవీ అనేక స్మార్ట్ ఫీచర్లు, క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా..ఇది HDMI, USB వంటి ఫీచర్లను కలిగి ఉంది. కంపెనీ ఈ టీవీపై 18 నెలల వారంటీని అందిస్తుంది.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad