Whatsapp AI Writing Feature: వాట్సాప్ తన కోట్లాది మంది వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదే మెటా AI రైటింగ్ హెల్ప్ ఫీచర్. యూజర్లు ఈ ఫీచర్ సహాయంతో ఇప్పుడు సందేశాన్ని మరింత సులభంగా వ్రాయగలుగుతారు. తరచుగా మనం వాట్సాప్‌లో పంపే కొన్ని మెసేజ్ లు తప్పుగా ఉంటాయి. చాలా సార్లు మనం సందేశాలు కొంచెం ప్రొఫెషనల్‌గా, మనకు ఇష్టమైన వ్యక్తికి ఫన్నీగా, భావోద్వేగంగా ఉండాలని అనుకుంటాం. అయితే, ఇప్పుడు ఈ పనిని వాట్సాప్ AI రైటింగ్ హెల్ప్ ఫీచర్ చేస్తుంది.
వాట్సాప్ రైటింగ్ హెల్ప్ ఎలా పనిచేస్తుంది?
చాట్ లో ఏదైనా సందేశాన్ని టైప్ చేసిన తర్వాత, చాట్ బాక్స్‌లోని కనిపించే పెన్సిల్ చిహ్నంపై నొక్కాలి. ఇప్పుడు మెటా ఏఐ 3 నుండి 4 కొత్త సూచనలను చూపిస్తుంది. అవి ప్రొఫెషనల్, ఫన్నీ, సపోర్టివ్ లేదా ప్రూఫ్ రీడ్ వంటి విభిన్న టోన్‌లలో ఉంటాయి. ఇప్పుడు మెసేజ్ నచ్చిన టోన్ లో ఎంచుకుని పంపాలి. ప్రత్యేక విషయం ఏమిటంటే? వాట్సాప్ మన సందేశం సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. అంటే, AI సూచనలను మాత్రమే అందిస్తుంది. కానీ సందేశాన్ని నిల్వ చేయదు లేదా చదవదు.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
1. అసైన్‌మెంట్‌లు లేదా ప్రొఫెసర్‌లకు సందేశం పంపే విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం.
2. బాస్ లేదా క్లయింట్‌లకు ప్రొఫెషనల్ సందేశాలను పంపే ఉద్యోగలకు ఈ ఫీచర్ హెల్ప్ చేస్తుంది.
3. స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫన్నీ లేదా భావోద్వేగ చాట్‌ల కోసం ఇది ఉపయోగపడుతుంది.
4. ఆంగ్లంలో మెసేజ్ రాయడం రానివారికి సహాయపడుతుంది.
వాట్సాప్ రైటింగ్ హెల్ప్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి?
Step 1: ముందుగా ఫోన్‌లోని వాట్సాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.
Step 2: ఇప్పుడు లాగిన్ అయినా తర్వాత ఏదైనా చాట్‌ని ఓపెన్ చేసి ఒక మెసేజ్ ను టైపు చేయాలి.
Step 3: మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు, టెక్స్ట్ బాక్స్‌లో ఒక చిన్న పెన్సిల్ సింబల్ ని కనిపిస్తుంది.
Step 4: ఇప్పుడు ఈ పెన్సిల్ సింబల్ పై క్లిక్ చేయగానే మెటా ఏఐ వివిధ రకాల సందేశాలను సూచిస్తుంది.
Step 5: ఇప్పుడు టైప్ చేసిన సందేశం ప్రొఫెషనల్, ఫన్నీ, సపోర్టివ్ లేదా ప్రూఫ్ రీడ్ గా మార్చవచ్చు.
Step 6: మెసేజ్ ను నచ్చిన టోన్ లో ఎంచుకుని సెండ్ చేయొచ్చు.


