Sunday, November 16, 2025
Homeటెక్నాలజీSmart Bands: ఈ స్మార్ట్‌ బ్యాండ్‌లను సెలబ్రెటీలు అందుకే ధరిస్తున్నారా?

Smart Bands: ఈ స్మార్ట్‌ బ్యాండ్‌లను సెలబ్రెటీలు అందుకే ధరిస్తున్నారా?

Smart Bands Benefits: ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషి యెుక్క అవసరాలు, ఆలోచన ధోరణి కూడా మారిపోతుంది. ఒకప్పుడు టైం చూసుకోవడానికి చేతికి వాచ్‌లు పెట్టుకునేవాళ్లం. అది ఆ తర్వాత స్మార్ట్ వాచ్ గానూ, ఇప్పుడు స్మార్ట్ బ్యాండ్‌ గానూ రూపాంతరం చెందింది. ఈ మధ్య కాలంలో సెలెబ్రెటీలు ఎక్కువగా స్మార్ట్ బ్యాండ్స్ ను ధరిస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటికి గిరాకీ కూడా బాగా పెరిగింది. వీటినే స్మార్ట్ స్ట్రాప్స్ లేదా స్మార్ట్ పట్టీలు అని కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు అంతలా ఇష్టపడుతున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఉపయోగాలు ఏంటి?

ఇటీవల కాలంలో క్రీడా ప్రముఖుల నుంచి సినీ సెలబ్రిటీల దాకా అందరూ స్మార్ట్ బ్యాండ్‌ లను ధరిస్తున్నారు. దీని వెనుక ఆరోగ్యపరమైన కారణం ఉంది. ఈ స్మార్ట్ బ్యాండ్‌ నిద్ర, హృదయ స్పందన రేటు, బీపీ మెుదలైనవి నమోదు చేస్తాయి. అంతేకాకుండా దీనిని ధరించినప్పుడు ఎలాంటి అసౌకర్యం కూడా కలుగదు. దీంటో డిస్ ప్లే లేకపోవడం వల్ల దీనిని సులభంగా క్యారీ చేయవచ్చు. పడుకొనేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. దీనిని తీక్షణంగా గమనిస్తే తప్ప స్మార్ట్ బ్యాండ్ అని కనిపెట్టలేం. మీ హెల్త్ ను మానిటర్ చేస్తూ ఆరోగ్య డేటాను నమోదు చేసి మనకు అందిస్తుంది. అందుకే విరాట్ కోహ్లీ వంటి క్రీడాకారులు వీటిని వాడుతున్నారు.

Also Read: Iphone 17 Series – ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ యాపిల్ చరిత్

ఇది ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్ వాచ్ లో స్క్రీన్ ఉంటుంది, పైగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పంపుతూ ఉంటుంది. దీంట్లో అలాంటివి ఏమీ ఉండవు. దీనికి మృదువైన ఫాబ్రిక్ పట్టీ లాంటిది ఉంటుంది. మనం చేతికి వాచ్ పెట్టుకున్నట్లే దీనిని కూడా ధరించవచ్చు. ఎటువంటి అసౌకర్యం కలుగదు. దీనిని సులభంగా ఛార్జ్ చేయడానికి చిన్న డాగ్ ఉంటుంది. వెల్క్రో పద్ధతితో దీన్ని హ్యాండ్స్ కు ధరించవచ్చు. డిస్ ప్లే లేకపోవడం వల్ల యాప్ ద్వారా మానిటర్ చేయడం దీని ప్రత్యేకత. ఇందులో ఉన్న ఆరా ట్యాబ్ మీ నిద్ర సమయం, హృదయ స్పందన రేటు, రోజువారీ విశ్రాంతి సమయం, అలవాట్లు మెుదలైనవి ట్రాక్ చేసి డేటాను అందిస్తుంది. మీకు చెమట తదితర కారణాల వల్ల కూడా ఈ బ్యాంట్ కు ఏమీ అవ్వదు. అంతేకాకుండా ఇది వ్యాయామం సమయంలో మన శారీరక స్థితిలోని వైవిధ్యాలను పర్యవేక్షిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad