Sunday, November 16, 2025
HomeTop StoriesXiaomi 17 Series: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో షియోమి 17 సిరీస్ స్మార్ట్...

Xiaomi 17 Series: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో షియోమి 17 సిరీస్ స్మార్ట్ ఫోన్లు..

Xiaomi 17 Series SmartPhones: ఐఫోన్ 17 సిరీస్‌కు క్రేజ్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. సెప్టెంబర్ 19న ఆపిల్ స్టోర్లలో ఐఫోన్ 17 సిరీస్‌ను కొనుగోలు చేయడానికి చాలామంది క్యూలు కట్టి కనిపించరు. ఆపిల్ ఆఫ్ చైనాగా పిలువబడే షియోమి, ఐఫోన్ 17 మాదిరిగానే తన శక్తివంతమైన షియోమి 17 సిరీస్‌ను కూడా విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ సెప్టెంబర్ 30న లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం ప్రీ-బుకింగ్‌లు చైనాలో ప్రారంభమయ్యాయి. షియోమి 17తో పాటు, షియోమి 17 ప్రో, షియోమి 17 ప్రో మాక్స్ కూడా రిలీజ్ కానున్నాయి.

- Advertisement -

ఈ షియోమి స్మార్ట్‌ఫోన్ సిరీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఫోన్‌లు వెనుక లైకా-బ్రాండెడ్ కెమెరాను కలిగి ఉంటాయి. నివేదికల ప్రకారం..కంపెనీ దానితో పాటు షియోమి ప్యాడ్ 8 సిరీస్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోని మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్‌ను షియోమి ప్రదర్శించింది. ఈ ప్రత్యేక ఫీచర్ ఫోన్ సెకండరీ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. దీనికి వెనుక కెమెరా మాడ్యూల్ అమర్చబడి ఉంటుంది. ఈ సెకండరీ డిస్‌ప్లేలో కాల్ నోటిఫికేషన్‌లు, సాంగ్స్, వినియోగదారులకు అనేక ఉపయోగకరమైన విడ్జెట్‌లు ఉంటాయి.

also read:SmartPhone Exchange: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్..పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా..?

షియోమి 17 సిరీస్‌లో ప్రత్యేకత ఏమిటి?

ఈ షియోమి స్మార్ట్‌ఫోన్ సిరీస్ గత సంవత్సరం లాంచ్ అయినా షియోమి 15 సిరీస్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. 15 తర్వాత నేరుగా 17 సిరీస్‌ను ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో శక్తివంతమైన కెమెరా, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ 3తో వస్తుంది.

ఇటీవలి లీక్ ప్రకారం.. షియోమి 17 ప్రో 6.3-అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6,300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన ప్రాథమిక కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. షియోమి ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ IP69 రేటింగ్‌తో వస్తుంది. దీని కారణంగా ఇది నీటిలో మునిగిన దెబ్బతినదు.

ఇదే సమయంలో షియోమి 17 6.3-అంగుళాల 1.5K LTPO OLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 100W వైర్‌తో వస్తుంది. ఇది మూడు 50MP కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఇది IP68, IP69 రేటింగ్‌కు మద్దతు ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad