Saturday, November 15, 2025
Homeటెక్నాలజీXiaomi 15T: త్వరలోనే షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌.. ఐఫోన్‌ను మించి అధిరిపోయే...

Xiaomi 15T: త్వరలోనే షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌.. ఐఫోన్‌ను మించి అధిరిపోయే ఫీచర్లు

Xiaomi New Smartphone Series Launch: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ రాబోయే ఫెస్టివల్ సీజన్‌లో కొత్త సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో షియోమీ 15 టీ, 15టీ ప్రో అనే రెండు మోడళ్లు రాబోతున్నాయి. ఇప్పటికే, ఈ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు లాంచింగ్‌కు ముందే లీకయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం, షియోమీ 15T మోడల్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో, ప్రో మోడల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కలిగించే మెటల్ ఫ్రేమ్‌తో రానుంది.

- Advertisement -

ఆకట్టుకునే డిస్‌ప్లే, ఫీచర్లతో..
షియోమీ 15T, షియోమీ 15T ప్రో మోడళ్లు 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, ప్రో మోడల్ 144 Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానున్నాయి. అయితే రియల్‌మీ 15T మోడల్ మాత్రం 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే రిజల్యూషన్ 2772×1280 పిక్సెల్‌లు, 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌, HDR10+, డాల్బీ విజన్‌తో ఉంటుంది. 15T మోడల్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌తో పనిచేస్తుంది. కాగా, ప్రో మోడల్‌లో మాత్రం డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌ను అందించింది. ఈ రెండు ఫోన్లు 12 GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ ఆప్షన్లతో విడుదలవుతున్నాయి.

పవర్ ఫుల్ కెమెరా, బ్యాటరీ..

ప్రో మోడల్‌లో ఓఐఎస్‌తో 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 900 ప్రైమరీ కెమెరా, శామ్‌సంగ్ జేఎన్‌5 సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ 5 ఎక్స్‌ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. మరోవైపు, సాధారణ 15T మోడల్‌లో 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, ఓఐఎస్‌ లేకుండా 2టీ జూమ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా సైతం ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వీటిలో లైకా బ్రాండింగ్, ఇమేజ్ ట్యూనింగ్ వంటి ఫీచర్లను కూడా అందించింది. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ రెండు ఫోన్‌లలో 5500mAh బ్యాటరీ ఉంటుంది. అయితే, సాధారణ 15T మోడల్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించగా.. ప్రో మోడల్ మాత్రం 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్లకి బాక్సులో ఛార్జర్ మాత్రం రాదని కంపెనీ తెలిపింది. కాబట్టి, ఛార్జర్‌ను విడిగా కొనాల్సి ఉంటుంది. ఈ ఫోన్లలో ఐపీ68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్, ఈసిమ్‌ సపోర్ట్ వంటి ఫీర్లను సైతం అందుబాటులోకి తేనుంది. షియోమి 15T స్మార్ట్‌ఫోన్‌ 194 గ్రాములు, ప్రో మోడల్ 210 గ్రాముల బరువు ఉంటుంది.

ధర ఎంతంటే?

లీక్ అయిన సమాచారం ప్రకారం, గ్లోబల్‌ మార్కెట్లో షియోమి 15T ధర €649 అంటే సుమారు రూ. 67 వేలు, షియోమి 15టీ ప్రో ధర €799 అంటే సుమారు రూ. 82,500 వరకు ఉండనుంది.
మొత్తం మీద షియోమి 15T& 15T ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఆకర్షణీయమైన డిజైన్, పవర్ ఫుల్ ప్రాసెసర్‌లు, హై లెవెల్ కెమెరా సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. సాధారణ మోడల్ బడ్జెట్ ధరకు మంచి ఫీచర్లను అందిస్తుండగా, ప్రో మోడల్ మాత్రం ప్రీమియం స్పెసిఫికేషన్లతో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad