HomeTop StoriesXiaomi phones: మొబైల్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. షియోమీ ఫోన్లు మరింత ప్రియం

Xiaomi phones: మొబైల్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. షియోమీ ఫోన్లు మరింత ప్రియం

Xiaomi phones to become more expensive: స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉపయోగించే సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరత, విడిభాగాల తయారీ ఖర్చు భారంగా మారడంతో స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. వరసపెట్టి స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచేస్తున్నాయి. శాంసంగ్‌, వివో, వన్‌ప్లస్‌ వంటి కంపెనీలు ఇప్పటికే పలుమార్లు తమ స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచుతూ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బిగ్‌ షాకిచ్చాయి. ఇదే తరహాలో షియోమీ మరోసారి తన 5 మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ. 5 వేల వరకు పెంచనున్నట్లు తెలిపింది.

- Advertisement -

Also Read: Shivarampally: ఓపెన్ స్పేస్‌కే ఓకే చెప్పారా?.. శివరాంపల్లిలో నిర్మాణ అనుమతులపై వివాదం

ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?

షియోమీ 17టీ: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 5 వేల వరకు ధరల పెంపు చేపట్టింది. 12జీబీ/256జీబీ వేరియంట్‌ రూ. 59,999 నుంచి రూ. 64,999 వరకు పెరిగింది. 12 జీబీ/512 జీబీ వేరియంట్‌ ధర రూ. 64,999 నుంచి రూ.69,999లకు చేరింది. రెండు నెలల క్రితమే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేయడం విశేషం.

రెడ్‌మీ నోట్‌ 15: ఈ ఫోన్‌పై ఏకంగా రూ.2 వేల వరకు ధర పెంచింది. 8 జీబీ/128 జీబీ వేరియంట్ ధరను రూ.26,999 నుంచి రూ.28,999కు పెంచింది. ఇక, 8 జీబీ/256 జీబీ వేరియంట్‌ రూ.29,999 నుంచి రూ.31,999లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. (లాంచింగ్‌ సమయంలో దీని ప్రారంభ ధర రూ.24,999 ఉండేది).

రెడ్‌మీ 15: ఈ మోడల్‌పై దాదపు రూ. వెయ్యి వరకు ధర పెరిగింది. 8 జీబీ/256 జీబీ వేరియంట్‌ ధర రూ.24,499 నుంచి రూ.25,499 వరకు చేరింది. 8 జీబీ/128 జీబీ ధర రూ. 22,499 నుంచి రూ.23,499 వరకు, 6 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ.20,499 నుంచి రూ.21,499కు పెరిగింది.

రెడ్‌మీ 15సీ: ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.1500 వరకు ధర పెంచింది. 8 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ.20,999 నుంచి రూ.22,499, 6 జీబీ/128 జీబీ ధర రూ.18,999 నుంచి రూ.20,499 వరకు పెరిగింది. 4జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.16,999 నుంచి రూ.18,499కు చేరింది.

రెడ్‌మీ 15ఏ: ఈ ఎంట్రీ లెవల్‌ మోడల్‌పై దాదాపు వెయ్యి రూపాయల నుంచి రూ.1500 వరకు పెంచింది. 6 జీబీ/128 జీబీ ధర రూ.17,999 నుంచి రూ.19,499, 4 జీబీ/128 జీబీ ధర రూ.15,999 నుంచి రూ.17,499 వరకు, 4 జీబీ/64 జీబీ ధర రూ.14,999 నుంచి రూ.15,999 వరకు పెరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News