Youtube: ఈరోజుల్లో ఎవరి చేతుల్లో చుసిన స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. ముఖ్యంగా చాలామంది యూట్యూబ్ లో రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ ఎక్కువ సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇందులో మీరు కూడా ఒకరా? అయితే, దీనిని నియంత్రించుకునేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు సమయం యూట్యూబ్ లో ఎంత సమయం షార్ట్స్ చూడాలో సెట్టింగ్స్‌లో ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ సెట్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ ద్వారా నిర్ణయించుకున్న సమయం పూర్తవగానే షార్ట్స్ ఫీడ్ ఆగిపోయి, యూజర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.
ఈ కొత్త టైమర్ ఫీచర్‌తో యూట్యూబ్ తన వినియోగదారులు షార్ట్స్ చూడడంలో వృధా చేసే సమయాన్ని నియంత్రించే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు 15, 30, 60 లేదా 90 నిమిషాల వరకు నచ్చిన సమయాన్ని పరిమితిగా పెట్టుకోవచ్చు. ఒకసారి నిర్ణీత సమయం చేరుకోగానే యూట్యూబ్ షార్ట్స్ ఫీడ్ ఆటోమేటిక్‌గా నిలిచిపోయి, ‘మీ రోజువారీ సమయం పూర్తయింది’ అనే మెసేజ్ కనిపిస్తుంది. అయితే, యూజర్ కోరుకుంటేనే ఈ పరిమితిని విస్మరించి, షార్ట్స్ చూడటం ప్రారంభించవచ్చు.
also read:IRCTC: ఇండియాలో ఒక్క రోజులో ఎన్ని ట్రైన్ టిక్కెట్స్ అమ్ముతారో తెలుసా..?
ఇప్పటికే యూట్యూబ్‌లో ‘టేక్ ఏ బ్రేక్’, ‘బెడ్‌టైమ్ రిమైండర్స్’ వంటి సమయ నియంత్రణ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, షార్ట్స్ ఫీడ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ ఫీచర్ యూజర్లు మరింత స్పష్టమైన మరియు నిర్మాణపరమైన నియంత్రణను పాటించడానికి సహాయపడుతుంది. అంతేకాదు, త్వరలో ఈ ఫీచర్‌ను పేరెంటల్ కంట్రోల్స్ కు కూడా అనుసంధానించాలని యూట్యూబ్ యోచిస్తోంది.
యూట్యూబ్ గతంలో కూడా లాంగ్ వీడియోల కోసం ‘డైలీ టైమ్ లిమిట్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే, యువతలో పెరుగుతున్న షార్ట్-ఫామ్ కంటెంట్ వ్యసనాన్ని నియంత్రించడానికి ఈ ‘డైలీ స్క్రోలింగ్ లిమిట్’ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ లేకుంటే ఇది యూజర్లను అనవసరమైన డూమ్‌స్క్రోలింగ్‌లో పాల్గొనేలా చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ షార్ట్స్ చూసే వ్యసనం మానసిక ఆరోగ్య పై ప్రభావం చూపుతుంది.


