అవును జాబ్ కట్స్, కాస్ట్ కటింగ్ అంటూ టెక్ కంపెనీలన్నీ సరికొత్త ఉద్వాసన బాటలో పయనిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక కంపెనీ ఉద్యోగులను ఊచకోత పనిలో పడింది. తాజాగా ఈ లిస్టులో చేరింది జూమ్ కంపెనీ కూడా. ఈమేరకు జూమ్ కంపెనీ సీఈవో ఎరిక్ యువాన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. 1,300 మంది జూమీస్ కు ఉద్యోగాలు పోతాయని ఆయన వెల్లడించారు. మరో అరగంటలో మీ ఉద్యోగాలు ఊడనున్నట్టు మీకు మెయిల్స్ రానున్నాయని లేఆఫ్స్ గురించి ప్రకటన చేశారు. జూమ్ అనేది అమెరికా కేంద్రంగా పనిచేసే కంపెనీ.
కోవిడ్ లాక్ డౌన్ టైంలో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఫర్మ్ జూమ్ బ్రహ్మాండమైన లాభాలబాట పట్టింది. వర్క్ ఫ్రం హోం ప్రపంచ వ్యాప్తంగా కారణంగా చాలామంది ఈ టెక్నాలజీ సపోర్ట్ తీసుకున్నారు. ఈమేరకు జూమ్ బ్లాగ్ లో సీఈవో చేసిన ప్రకటన షాకింగ్ గా మారింది. జూమ్ ఉద్యోగులను యువాన్ జూమీస్ గా పిలుస్తారు. ఇలా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి 16 వారాల జీతం ఇచ్చి, హెల్త్ కేర్ ..ఇతరత్రా బెనిఫిట్స్ అన్నీ కల్పించనున్నట్టు సంస్థ ప్రకటించింది.