ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామానికి చెందిన ఆదివాసి సకల కళ సంక్షేమ సంఘానికి ప్రపంచ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించిందని ఆదివాసి సకల కళ సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ” జయతి జయ మామ భారతం ” అనే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొన్న మా బృందానికి ఈ ఘనత లభించిందని తెలిపారు.
దేశ నలుమూలల నుండి అనేక ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులతో మేమంతా కలిసి నృత్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ సెక్రెటరీ అరునిష్ చావ్లా సంగీత్ నాటాక్ అకాడమీ డాక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. కళాకారులు గంగారం నాగేష్ భాస్కర్ లక్ష్మణ్ సంజీవ్ సందీప్ సాగర్ పరుశురాం శ్రీకాంత్ ప్రకాష్ గోవింద్ రావ్ గంగారం విశ్వనాథ్ తో పాటు సంఘం ప్రధాన కార్యదర్శి ఆనంద్ పాల్గొన్నారు.