Wednesday, April 16, 2025
HomeTS జిల్లా వార్తలుఆదిలాబాద్Adilabad: గుస్సాడీ నృత్యం చేసిన కలెక్టర్

Adilabad: గుస్సాడీ నృత్యం చేసిన కలెక్టర్

సంప్రదాయాలు కాపాడుకుందాం

ఆదిలాబాద్ గిరిజనుల సంప్రదాయ నృత్యమైన గుస్సాడీ డ్యాన్స్ చేశారు కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం నిర్వహించిన ట్రైబల్ కల్చర్ మీట్ 2024-25 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన చిత్రాలను తిలకించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గుస్సాడీ వేషధారణలో ఉత్సాహంగా గుస్సాడి నృత్యం చేశారు.

- Advertisement -

విద్యార్థుల కేరింతల నడుమ

కలెక్టర్ నృత్యం చేస్తూ ఉంటే విద్యార్థులందరూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను ఆచారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రభుత్వం ఆదివాసీల ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News