Monday, January 20, 2025
HomeTS జిల్లా వార్తలుఆదిలాబాద్Manchiryala: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు

Manchiryala: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రకటన

సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. సోమవారం స్మశాన వాటిక పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులు పరిశీలించిన పిదప సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు.

- Advertisement -

హామీ మేరకు

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాలను విద్యా, వైద్యంకు ప్రధాన కేంద్రంగా మారుస్తానని అన్నారు. ఉన్నత విద్య, వైద్యం అందిస్తానని హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చదువు, వైద్యం కోసం వెళ్ళే పరిస్థితి తీసుకురానని చెప్పారు. ఎన్నికలు తొమ్మిది నెలల ముందు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రజల్లో మమేకం అవుతానని తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పురోగతి దశలో ఉన్నాయని చెప్పారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఫిష్ పాండ్ మంజూరు కాగా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. స్మశాన వాటిక నిర్మాణం పనులు చకచకా జరుగుతుండగా శివరాత్రికి ప్రారంభిస్తామని అన్నారు. గోదావరి ఒడ్డున తీసిన మట్టి స్మశాన వాటికకు వినియోగించామని మాజీ ఎమ్మెల్యే ఆరోపించినట్లు అమ్ముకోలేదని వివరణ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనే ఒకటి, రెండు చోట్ల మినహా ఇలాంటి స్మశాన వాటిక లేదని అన్నారు. నాలుగు ఎకరాల విశాల స్థలంలో ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం జరుగుతోందన్నారు. సోలార్ విద్యుత్, 12 రోజుల ఖర్మ ప్రక్రియ అక్కడే ఉండి నిర్వహించడానికి ప్రత్యేక గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

9, 10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి రాక

9,10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరువురు మంత్రులు మంచిర్యాలకు రానున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. పురోభివృద్ధిలో ఉన్న అభివృద్ధి పనులను, పట్టణాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. భట్టి, పర్యటనతో అదనపు నిధులు మంజూరు అవుతాయని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అధికారులు, కాంగ్రెస్ నేతలున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News