Viral Video today: సినిమాలు చూసి ఇన్ స్పైర్ అయ్యారో లేదో తెలియదు కానీ కొంత మంది నేరస్థులు చాలా డిఫరెంట్ గా క్రైమ్ చేస్తున్నారు. వారి తెలివితేటలు చూసి పోలీసులే కాదు, మనం కూడా అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లరే ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి ఖాకీలకు చిక్కాడు. ఇతడు మందు బాటిళ్లను ఎలా రవాణా చేస్తున్నాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. తాజాగా ఈ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతుంది.
ఆదిలాబాద్ జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల చిక్కకుండా వినూత్న పంథాలో మద్యాన్ని తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా వీరి ఎత్తుగడలకు పోలీసులు చెక్ పెట్టారు. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను నూతన మార్గాల్లో తరలిస్తున్న నేరస్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరు ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను ఒంటిపై ధరించి వాటిలో మద్యం బాటిళ్లను రవాణా చేస్తున్నారు. తాజాగా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టడంతో వీరి గుట్టురట్టు అయింది.
ఇలాంటి ఘటనలు మూడు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు చేపట్టిన ఈ తనిఖీల్లో సుమారు రూ.5వేల విలువ గల 140 మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి పేర్లు అశోక్, రజిత, అరుణ్. వీరిని విచారించగా.. తాము పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి మద్యాన్ని తీసుకొచ్చి తెలంగాణలోని గ్రామాల్లో అమ్ముతున్నారు తెలిపారు. ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల్ వర్షం కురిపిస్తున్నారు. ‘నీ తెలివి మామూలుగా లేదు భయ్యా..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.