Indiramma canteens: జీహెచ్ఎంసీ పరిధిలో పేదల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఇక మీదట ఇందిరా క్యాంటీన్ల పేరుతో సేవలు అందించనున్నాయి. 2014 నుంచి 5 రూపాయలకే భోజన వసతి కల్పిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్పు చేసేందుకు జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 139 ప్రాంతాల్లో గతంలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ల భవన నిర్మాణాలను పునరుద్ధరించనుంది.
అన్నపూర్ణ క్యాంటీన్లకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 373 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉండగా వీటిలో 53 కేంద్రాల్లో డబ్బాలు పాడవ్వడంతో మూతపడ్డాయి. ప్రస్తుతం 320 క్యాంటీన్లలో పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. వీటి ద్వారా జీహెచ్ఎంసీ పరధిలో ప్రతి రోజూ సుమారు 40వేల మందికి పైగా తమ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం భోజనం మాత్రమే అందిస్తుండగా తాజా నిర్ణయంతో ఇడ్లీ, టమాట బాత్, వడ, ఉప్మా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/maoists-warning-letter-to-minister-seethakka/
హైదరాబాద్ మహానగరంలో రోజువారీ కూలీలు, విద్యార్థులు, పేద ప్రజల ఆకలిని కేవలం ఐదు రూపాయలకే తీరుస్తున్న ‘అన్నపూర్ణ’ భోజన కేంద్రాలు ఇకపై కొత్త పేరు, కొత్త హంగులతో దర్శనమివ్వనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం, ఈ పథకం రూపురేఖలను సమూలంగా మార్చనుంది.
గతంలో భోజనంకే పరిమితమైన అన్నపూర్ణ క్యాంటీన్లను ఇప్పుడు ఇందిరా క్యాంటీన్ల పేరు మీదుగా మరిన్ని సేవలు అందించనున్నారు. గతంలో మధ్యాహ్నం పూట భోజనం మాత్రమే అందించేవారు. తాజాగా స్టాండింగ్ కమిటీ నిర్ణయంతో రోజు పొడవునా కష్టపడే శ్రామికులను, ఉదయాన్నే పనులకు, కాలేజీలకు వెళ్లేవారిని దృష్టిలో ఉంచుకొని, ఇకపై ఈ ఇందిరా క్యాంటీన్లలో ఉదయం పూట అల్పాహారం (టిఫిన్) కూడా అందించనున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రతకు డోకా లేకుండా పోయింది. కాగా, క్యాంటీన్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని, ప్రస్తుత నిర్మాణాలను పునరుద్ధరించి ఆధునీకరించాలని స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/bandi-sanjay-angry-over-the-name-change-of-the-annapurna-meal-scheme/
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రవేశపెట్టింది. హరే కృష్ణ ఛారిటీస్ సహకారంతో జీహెచ్ఎంసీ ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. అయితే, 2014లో 5 రూపాయలకే భోజన కార్యక్రమం పేరిట సేవలు అందిస్తున్న దీనికి గత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నపూర్ణ క్యాంటీన్లుగా 2017లో నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కాగా అటు ఏపీలోనూ 2014లో టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరుతో పేదల ఆకలి తీర్చింది. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తుంగలో తొక్కగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తిరిగి 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటయ్యాక ఏపీలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు. అటూ తమిళనాడులో సైతం అమ్మ క్యాంటీన్లతో మాజీ సీఎం జయలలిత పేరొందారు.
Annapurna Canteens Renamed: ఇక ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో 5 రూపాయలకే భోజనం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES