Saturday, July 12, 2025
HomeTS జిల్లా వార్తలుHarish Rao Comments: ఆటో కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao Comments: ఆటో కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: మాజీ మంత్రి హరీష్ రావు

Auto workers sucides are govt murders: ఆటో కార్మికులను సీఎం రేవంత్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుని పటాన్‌చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితం దయనీయంగా మారిందని వాపోయారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ముందుండి పరిష్కారానికి కృషి చేయాలని వారు హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు.



ఆటోవాలా సమస్యలపై రావు స్పందిస్తూ… ఆటో కార్మికుల ఆత్మహత్యలు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12 వేల భృతి ఇస్తాని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదని హరీష్ వాపోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీతో ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆటో డ్రైవర్లు ఆర్థికంగా కుదేలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు.


ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/annapurna-canteens-renamed-indiramma-canteens-ghmc/

ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలువాటుగా మారిందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించినది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని బీఆర్‌ఎస్ తరఫున హరీష్ రావు డిమాండ్ చేశారు. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.


ALSO READ: https://teluguprabha.net/cinema-news/kamal-haasan-and-ayushmann-khurrana-invited-to-join-the-academy-for-oscars/

కాగా, 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు నష్టపోకుండా ఏడాదికి రూ.12 వేలు ఆర్థికాసాయం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసింది. దీంతో ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గత మే నెల 27న ఇందిరా పార్కు వద్ద ఆటో కార్మికులు ‘ ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు’ పేరు మీదుగా ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News