Sunday, July 13, 2025
HomeTS జిల్లా వార్తలుRS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్‌కు ఆజ్యం పోసిందే కాంగ్రెస్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన...

RS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్‌కు ఆజ్యం పోసిందే కాంగ్రెస్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

RS Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్‌కు ఆద్యం పోసిందే కాంగ్రెస్ అని, సీఎం రేవంత్ ఆదేశాలతోనే బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లోనిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు కాంగ్రెస్ కుట్రలో పావులు కావొద్దని ప్రవీణ్ కుమార్ సూచించారు. రేవంత్ రెడ్డికి విచక్షణ, ఙ్ఞానం, భద్రతపై అవగాహన లేదని వ్యాఖ్యానించారు.చంద్రబాబులా కేటీఆర్ దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్డిలో స్టార్షన్, డైవర్షన్, డిస్ట్రాక్షన్ (3D) ఫాలో అవుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు రేవంత్ లీకులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ, నాయకులపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అంతర్గత, శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న భద్రతా విధానాల గురించి బహిరంగంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/ycp-president-and-ex-cm-jagan-criticizes-minister-nara-lokesh-through-satirical-tweet/

ట్యాపింగ్ అంశంపై సిట్ అధికారులు లేదా కమిషనర్ అవసరమైతే ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు చెప్పాలని, సున్నితమైన అంశంపై రాజకీయాలు తగవు అని సూచించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేస్తున్నది సిట్ అధికారులా లేక గాంధీ భవన్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులా అని ప్రవీణ్ కుమార్ సందేహం వ్యక్తం చేశారు. సీఎం,ఆయన వ్యక్తిగత టీం, గాంధీభవన్ నుంచే లీకులు వస్తున్నాయని ఆరోపించారు.

ఈ లీకులను ఆధారంగా చేసుకుని మీడియా దుష్ప్రచారం చేస్తోందని, వ్యక్తుల పరువుకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే మీడియా పేరుతో దాడి చేయడం దారుణమన్నారు. అభిమాన నాయకులపై ఫేక్ ప్రచారాలు చేయడాన్ని తట్టుకోలేక, ప్రజలు దాడి చేస్తే దానికి ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ట్యాపింగ్ అంశంపై కథనాలు రాయొద్దని సూచించినా, కొన్ని మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, వ్యక్తిగత గౌరవాన్ని, హక్కులను కాలరాసే హక్కులు లేవని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం పూర్తిగా పోలీసు శాఖకు సంబంధించిన విషయమని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/ycp-president-and-ex-cm-jagan-criticizes-minister-nara-lokesh-through-satirical-tweet/

ఏ ముఖ్యమంత్రి అయినా ఫలానా నెంబర్లు ట్యాప్ చేయాలని చెప్పరని, రాష్ట్ర భద్రత కోసం పోలీసు‌లే ట్యాప్ చేస్తారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సిట్ విచారణలో ఏం జరుగుతుందో? ఏం ఆధారాలు లభించాయో… ఆ వివరాలను కేవలం అధికారులే చెప్పాలని, కానీ తెలంగాణలో రాజకీయ నాయకులు వివరాలు చెబుతుండడం దారుణమని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ బాధితులు మాత్రమే అని ప్రవీణ్ కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News