Bnakacharla Project: చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను తరలించే కుట్ర చేస్తున్నారని, ఆయన మాయలో మనం పడొద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి, బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా లేదని విమర్శించారు. కృష్ణా నది నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు గోదావరి జలాల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి, బనకచర్లపై నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో సీరియస్‌గా చర్చించలేదన్నారు. బనకచర్లపై అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/harish-rao-challenge-to-cm-revanth-on-banakacharla/
చంద్రబాబును చర్చలకు పిలవాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చర్య అని జగదీష్ రెడ్డి విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్వహించేందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపితే తెలంగాణకే నష్టం అని పేర్కొన్నారు. ఒక వర్గం మీడియా పథకం ప్రకారం తెలంగాణలో రాజకీయ పార్టీల పంచాయితీగా గోదావరి జలాల అంశాన్ని చూపెడుతోందని విమర్శించారు. గోదావరి నదీ జలాలు తెలంగాణ బతుకుదెరువు అంశం అని బజారు పంచాయితీ కాదని అన్నారు. బనకచర్లపై ప్రభుత్వ చర్యలు సరైన మార్గంలో లేవని అన్నారు. గోదావరి, కావేరి లింక్ అని చంద్రబాబు చెప్పడం పెద్ద మోసం అన్నారు. గోదావరి, కావేరి లింక్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎప్పుడో అభ్యంతరం చెప్పిందని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు, బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు గోదావరి జలాల అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ రాకముందే 200 టీఎంసీలకు హక్కు కల్పించుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారన్నారు.
గోదావరి మిగులు జలాలు వాడుకోవాలంటే కృష్ణానది ద్వారా తెలంగాణకు గోదావరి జలాలు రావాలని కేసీఆర్ చెప్పారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి మిగులు జలాలు ఏ విధంగా ఉపయోగం అవుతాయో కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. మోదీకి చంద్రబాబు ఊపిరిగా మారాడని, ఆయన అవసరం బీజేపీకి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి ఎంపీలను గెలిపించలేదా అని ప్రశ్నించారు. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్‌ను అని చంద్రబాబు నాయుడును కాదని సూచించారు. ప్రభుత్వం కార్యాచరణ తీసుకొకపోతే ప్రజలను కలుపుకుని బనకచర్లపై పోరాటం చేస్తామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/mp-raghunandan-rao-reaction-on-threatening-call/
ప్రభుత్వం రైతు సంబురాలు ఎందుకోసం నిర్వహిస్తోందని ఆయమన ప్రశ్నించారు. 2014కు ముందు పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, సంబురాలు చేసుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా అని విమర్శించారు. రైతులు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు సహాయం చేయడమా అని జగదీష్ ఎద్దేవా చేశారు. సూర్యాపేటలో రప్పా రప్పా ఫ్లెక్సీలు తన దృష్టికి రాలేదని ఆయన పేర్ొన్నారు.
Jagadeesh Reddy Comments: చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు: బనకచర్లపై జగదీష్ రెడ్డి సూచన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES