Balkampeta Ellamma: పుణ్యదేవస్థానాల వద్ద భక్తులకు ప్రసాదం, పులిహోర, లడ్డూ, శనగలు, మజ్జిగ వంటివి ప్రసాదంగా అందజేస్తూ కొంతమంది తమ దాతృత్వాన్ని చాటుకోవడం చూస్తుంటాం. కానీ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం సందర్భంగా కొందరు దాతలు భక్తులకు కల్లు పంపిణీ చేయడం గమనార్హం. ఇవాళ ఎల్లమ్మ తల్లి కల్యాణానికి వచ్చిన భక్తలకు దాతలు కల్లు దానం చేశారు.
బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు కల్లు దానం చేస్తున్న దాతలు. అత్యంత మహిమ గల అమ్మవారిగా పేరుగాంచించిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని ఇవాళ ఉదయం 11.51 గంటలకు కనుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి కల్యాణాన్ని తలికించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న వేదపండితుల గణపతి పూజ నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 4 గంటలకు ఒక గంటలకు అమ్మవారిని అభిషేకించి ఉదయం ఎన్ని గంటల నుంచి స్థాపిత దేవతల పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మహా విద్య చండి మూలమంత్ర అనుష్టానం, వేద పారాయణం నిర్వహించారు. 11.51 గంటలకు అభిజిత్ లగ్నం ముహూర్తంలో జమదగ్ని మహర్షి అమ్మవారి కల్యాణ తంతు జరిపారు.
ఉత్సవాల మూడో రోజు బుధవారం అమ్మవారు పూజలు, ఫలహార బండ్ల ఊరేగింపు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో జరిగే అమ్మవారి కళ్యాణానికి భక్తులు లక్షలాదిగా హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారిక కల్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే తొలి మంగళవారం ఎల్లమ్మ వార్షిక కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

కాగా, ఉదయం 5 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. వీఐపీ ఎంట్రీ కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అమ్మవారి కల్యాణాన్ని చూడటానికి భక్తులు, శివసత్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ఐదుగంటలకు పైగా సమయం పడుతోంది. ఉత్సవాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. మొదటి రోజు పెళ్లికూతురు, ఎదుర్కొళ్ల కార్యక్రమం, రెండో రోజు కల్యాణం, మూడో రోజు రథోత్సవం జరుగనుంది. అమ్మవారి కల్యాణం సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సనత్‌నగర్, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, నాలుగు మార్గాల్లోని రోడ్లను మూసివేశారు.
ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ఆర్ అండ్ బి, నేచర్ క్యూర్ ఆసుపత్రి, జిహెచ్ఎంసి మైదానం, పద్మశ్రీ అపార్ట్మెంట్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద, ప్రా ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులు వారి వారి వెసులుబాటును బట్టి వాహనాలను సూచించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే పార్టీ చేయాలని పోలీసులు వెల్లడించారు.అమ్మవారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.