Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుDouble Murders | సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

Double Murders | సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు (Double Murders) కలకలం సృష్టించాయి. బైక్ పై వెళుతున్న తల్లి, కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే దారుణంగా హత్య చేశాడు. ఊరి నడిబొడ్డున ఇంతటి ఘోరం జరుగుతున్న ఏ ఒక్కరూ హంతకుడిని అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం హత్య చేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే…

- Advertisement -

గుమ్మడిదల మండలం, బొంతపల్లి గ్రామ పరిధిలోని వీరభద్ర నగర్ కాలనీలో ఉత్తర ప్రదేశ్ కి చెందిన కొన్ని ఫ్యామిలీలు వలస వచ్చి స్థిరపడ్డాయి. వీరిలో ఓ కుటుంబానికి చెందిన తల్లి సరోజాదేవి (50) ఆమె కుమారుడు అనిల్ (30) గురువారం ఉదయం బైక్ పై వెళుతున్నారు. అదే సమయంలో కారుల వచ్చిన ఓ వ్యక్తి వీరు ప్రయాణిస్తున్న బైకును అడ్డగించాడు. తల్లి కుమారుడిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.

Also Read : దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలు చేసిన ప్రియుడు

ఈ ఘటనలో సరోజా దేవి అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు అయితే హత్యకు పాద కక్షలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. యూపీ కి చెందిన మరో కుటుంబానికి సరోజాదేవి కుటుంబానికి గత ఆరు నెలలుగా రెండేళ్ల బాబు మృతి విషయంలో వివాదం నడుస్తోందని తెలిపారు. ఈ విషయంలోని ఒకే కుటుంబానికి చెందిన తల్లి కొడుకులు హత్యకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాగా ఘటనపై సమాచారం అందుకున్న సిఐ సుధీర్ కుమార్ ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్య చేసినట్టు భావిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జంట హత్యల (Double Murders) పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad