Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుSchool Bus Fire Accident: ప్రైవేటు స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

School Bus Fire Accident: ప్రైవేటు స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Private School Bus: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కృష్ణారెడ్డి పేట్‌లో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. ఓ ప్రయివేట్ స్కూల్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే, విద్యార్థులు బస్సు ఎక్కే సమయంలో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, సహాయకుడు వెంటనే విద్యార్థులను సురక్షితంగా బస్సులో నుంచి కిందకు దింపేశారు. అయితే ప్రమాదంలో చాలా వరకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది? మంటలు ఎలా వ్యాపించాయి అనే సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటినా అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే ప్రమాదంలో బస్సు పాక్షికంగా కాలిపోయింది. ఫైర్ ఆక్సిడెంట్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆగి ఉన్న సమయంలో.. ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అదే బస్సు వేగంగా వెళుతున్న సమయంలో జరిగితే ప్రమాద తీవ్రతను అంచనా వేయడం కూడా కష్టమని, విద్యార్థుల భవిష్యత్తు ఏమై ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ప్రైవేటు స్కూల్ బస్సులు నడపాలంటే కనీస నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే..

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ramayana-creates-history-before-release/

15 ఏళ్లు నిండిన బస్సుల్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లకూడదు. ఐదేళ్ల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి డ్రైవర్లు మధుమేహ, కంటిచూపు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. 60 ఏళ్లు నిండిన వాళ్లను డ్రైవర్లుగా నియమించరాదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బస్సులో ఉంచాలి. అందులో కావాల్సిన మందులు ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. పాఠశాల, కళాశాల పేరు, ఫోన్‌ నంబర్‌, పూర్తి చిరునామాను బస్సుకు ఎడమవైపు వెనుక భాగంలో కనిపించేలా రాయించాలి. బస్సుకు కనీసం ఒక అటెండర్‌ను నియమించుకోవాలి. పిల్లలు ఎక్కేది, దిగేది డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా కుంభాకార అద్దాలు అమర్చాలి.

ALSO READ: https://teluguprabha.net/national-news/indias-rs-20000-crore-defense-proposal-on-trikal-drones/

లోపల ఒక పెద్ద పారదర్శక కుంభాకార అద్దం సైతం ఏర్పాటు చేయాలి. ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో అగ్నిమాపక యంత్రం పొడి అందుబాటులో పెట్టాలి. ప్రతి విద్యాసంస్థ తాము కలిగిన పది బస్సులకు అదనంగా మరో బస్సును కూడా ఉంచుకోవాలి. రక్షణ చర్యలో భాగంగా కిటికీల మధ్యలో ఇనుప కడ్డీలను అమర్చాలి. ఫుట్‌బోర్డు పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించకుండా ఏర్పాటు చేసుకోవాలి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad