Monday, June 23, 2025
HomeTS జిల్లా వార్తలుRecord Breaking Cow Sale: 10 లక్షల ధర పలికిన గిర్ ఆవు

Record Breaking Cow Sale: 10 లక్షల ధర పలికిన గిర్ ఆవు

Cow Record Price: యాదాద్రి భువనగిరి జిల్లా గుమ్మి రామిరెడ్డి గోశాలలోని గిర్ జాతికి చెందిన ఓ ఆవు రికార్డు స్థాయి ధర పలికింది. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమిత్ కిషన్ అనే వ్యక్తి రూ. 10 లక్షలకు కినుగోలు చేశాడు. గిరి జాతికి చెందిన ఈ ఆవు 16 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది.


పల్లెల్లో సాధారణ జాతికి చెందిన ఆవు ధర పది వేల రూపాయల నుంచి రూ. 50 వేల వరకు పలుకుతుంది. ఇంకొంచెంం పాలదిగుబడి అధికంగా ఇచ్చే ఆవు అయితే 60 వేల రూపాయల వరకు అమ్ముడుపోతుంది. కానీ, రామిరెడ్డి గోశాలలోని గిర్ జాతికి చెందిన ఈ ఆవు ఏకంగా రూ.10 లక్షల ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగున్నరేళ్ల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురానికి చెందిన గుమ్మి రామిరెడ్డి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ​నుంచి రెండు గిర్​ జాతి ఆవులను తెచ్చాడు. వాటి కోసం గోశాల ప్రారంభించాడు. గోశాల రానురాను బాగా వృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ గోశాలలో 132 వరకు గిర్​ జాతి ఆవులు ఉన్నాయి.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/what-will-happen-if-you-eat-banana-every-day-for-a-month/

అయితే, సత్యసాయి జిల్లాకు చెందిన అమిత్ కిషన్ కొన్న ఆవు ఉదయం 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్ల చొప్పున రోజుకూ ఏకంగా 16 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. గేదెలు ఎక్కువగా పాలు ఇస్తాయి, కానీ ఈ ఆవులు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం చాలా రేర్. ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల నిర్వాహకుడు అమిత్ గిర్ ఆవును రూ.10 లక్షలకు కొనుగోలు చేసి తన వాహనంలో పెనుగొండకు తీసుకెళ్లాడు. మొత్తానికి ఈ గిర్ జాతికి చెందిన ఆవు 10 లక్షల రూపాయలు చేయడం విశేషం.

ALSO READ: https://teluguprabha.net/sports-news/rohit-sharma-post-emotional-instagram-story/

కాగా, ఒంగోలు జాతికి చెందిన ఆవులు రోజుకు 6 నుంచి 10 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో 17 లీటర్ల వరకు కూడా పాలు ఇవ్వగలవు. ఒంగోలు జాతికి చెందిన ఆవులకు కొన్ని రకాల వ్యాధులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఇతర జాతుల కంటే ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాతి ఆవులు పెద్దవిగా, బలంగా ఉండడంతో వీటిని బరువులు లాగడానికి, వ్యవసాయ పనులకు వినియోగిస్తారు. ఒంగోలు ఆవులు తమ దూడలను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి వాటికి దగ్గరగా ఉంటాయి. దేశంలో సుమారు 40 రకాల ఆవు జాతులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి సాహివాల్, గిర్, రెడ్ సింధీ, థార్ పార్కర్, హోల్స్టీన్-ఫ్రీసియన్, ఒంగోలు. పాల దిగుబడిలో ఎక్కువగా గిర్, రెడ్ సింధీ, సాహివాల్, హోల్స్టీన్-ఫ్రీసియన్ ప్రసిద్ధి చెందాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News