Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుGirl Kills Her Mother: ప్రేమకు అడ్డుందని, ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కన్నకూతురు

Girl Kills Her Mother: ప్రేమకు అడ్డుందని, ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కన్నకూతురు

Jeedimetla Murder Case: నవమాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి పెద్దచేసిన కన్నతల్లి పాలిట సొంత కూతురే యమపాశంగా మారింది. ప్రియుడితో కలిసి కన్నతల్లినే దారుణంగా హత్య చేసింది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసిన తల్లి ‘నీవు చదువుకుంటున్నావు..ఈ ప్రేమ ఇవన్నీ అవసరమా’ అని మందలించినట్లు దర్యాప్తులో తేలింది. తల్లిపై కోపం, అక్కసుతోనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు సమాచారం.



ఎన్‌ఎల్‌బీ నగర్‌లో అంజలి(39) నివాసం ఉంటోంది. అంజలి కూతురు పదో తరగతి చదువుతోంది. ఎనిమిది నెలల క్రితం నల్గొండకు చెందిన శివ అనే యువకుడితో బాలికకు పరిచయం అయ్యింది. ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. రోజూ సెల్‌లో మాట్లాడుకునేవారు. విషయం తెలిసిన తల్లి అంజలి పదో తరగతికే ప్రేమ ఏంటని బాలికను మందలించింది. దీంతో వారం క్రితం బాలిక ప్రియుడు శివతో కలిసి వెళ్లిపోయింది. తర్వాత మూడు రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/hero-sriram-remanded-till-july-7th-in-drugs-case/

తమ ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని, ఎలాగైనా అంతమొందించాలని బాలిక, ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ కలిసి స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి ప్రియుడు శివ జీడిమెట్లకు వచ్చాడు. ఈక్రమంలో ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశారు. బెడ్‌షీట్‌తో ప్రియుడు శివ అంజలి ముఖాన్ని కప్పివేశాడు. వెంటనే తల్లి తలపై కూతురు సుత్తితో బాదింది. శివ తమ్ముడు యశ్వంత్ కత్తి తీసుకొని పీక కోసి అంజలిని దారుణంగా మర్డర్ చేశారు. ప్రస్తుతం ఈ హత్య కేసు రాష్ర్టంలో సంచలనంగా మారింది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, మృతురాలు అంజలి తెలంగాణ ఉద్యమకారిణి, వీరవనిత చాకలి ఐలమ్మకు మునిమనవరాలు.

ALSO READ: https://teluguprabha.net/business/petrol-price-hike-india-hormuz-oil-crisis-2025/

ఈ హత్య కేసు ఘటన ప్రస్తుతం తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తోంది. జన్మనిచ్చిన తమకే జీవితం లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఉన్నత లక్ష్యాలకు బంగారు బాటలు వేయాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. వారి కలల కోసం ఎన్నో కష్టాలు పడుతారు. నిత్యం అడ్డంకులు ఎదుర్కొంటారు. తమ పిల్లలు చదువుకొని, ఉన్నత స్థానాల్లో ఉంటే అదే తమకు దక్కిన గౌరవంగా సమాజంలో తలెత్తుకొని తిరుగుతారు. అలాంటి తల్లిదండ్రులకు నేటితరం యువత శాపంగా మారుతున్నారు. టెక్నాలజీ మాయలో పడిపోయి ప్రేమ వ్యవహారం నడుపుతూ మందలించారనే పగతో జన్మనిచ్చినవారినే కడతేర్చుతున్నారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad