Grama Palana Officers: తెలంగాణ ప్రభుత్వం 10,954 జీపీవో పోస్టుల భర్తీలో భాగంగా గత మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పూర్వ వీఆస్ఏ, వీఆర్వోలకు అవకాశం కల్పించింది. ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు. ఈ క్రమంలో మిగిలిన 7404 ఖాళీల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
జూలై 16 లోపు పూర్వ వీఆర్‌ఏ, వీఆర్వోలు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా అందజేయాలని సూచించారు. ఈనెల 27న జీపీఓ పోస్టుల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో జీపీవోలు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల గ్రామాల్లో భూ వివాదాలు కుప్పులుతెప్పలుగా పడిఉన్నాయి. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ జీపీఓల నోటిఫికేషన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/nagarjuna-sagar-dam-overflow-with-floods/
విద్యాఅర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి
వయసు: 18 నుంచి 44 సంవత్సరాల లోపు(ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, పీడ్ల్యూడీ వారికి సడలింపు)
శాలరీ: నెలకు రూ.20 వేల నుంచి రూ.24 వేలు
నోట్: ఈ అధికారులు మాజీ వీఆర్‌ఓలు/ వీఆర్‌ఏల సమూహం నుంచి నియామకం అవుతారు. వీరిని గ్రామ పాలనా ఆఫీసర్ (GPO)గా నియమిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం- 16 జూలై 2025 నుంచి
పరీక్ష తేదీ: 27-07-2025
ALSO READ: https://teluguprabha.net/national-news/earthquake-in-delhi-4-4-magnitude-earthquake-hits-delhi-ncr/
జీపీఓల విధులు :
రికార్డుల నిర్వహణ: గ్రామంలోని భూములు లేదా ఆస్తులకు సంబందించిన ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది.
ఆదాయ సేకరణ : గ్రామస్తులు చెల్లించాల్సిన పన్నులు (వ్యవసాయ పన్నులు, ఆస్తి పన్నులు) లేదా ఇతర రుసుములను (మార్కెట్ పన్నులు) సకాలంలో సేకరించడం.
నియంత్రణ అమలు : గ్రామస్థులు స్థానిక చట్టాలు లేదా శాసనాలు, జోనల్ చట్టాలు, వ్యవసాయ చట్టాలు, ఆస్తి నిబంధనలతో సహా పాటించేలా చూసుకోవడం.
వివాద పరిష్కారం: భూమి యాజమాన్యం, వారసత్వం లేదా పన్ను సమస్యలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కృషి చేయడం.
పర్యవేక్షణ : సేకరించిన ఆదాయం సరిగ్గా నమోదు చేయబడినదా? లేదా? స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోబడుతున్నాయో? లేదో? నిర్ధారించుకోవడం.
ఉన్నతాధికారులతో సమన్వయం : గ్రామం లేదా గ్రామ పరిధిలోని ఆర్థిక స్థితిగతుల గురించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు అందించాల్సి ఉంటుంది. రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పథకాల విధానాలు లేదా నియమ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం.


