Kaleshwaram Commistion: మొన్న ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదని 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. వందలాది మంది ద్రోహులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ అని, తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. బేసిన్లు తెలియని వ్యక్తి సీఎం అయ్యారని, బేసిక్‌లు తెలియని ఉత్తమ్ ఇరిగేషన్ మినిస్టర్ అయ్యారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా శుక్రవారం హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోస్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్‌తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లడారు.
గత ప్రభుత్వంవలో ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయన్నారు. మేడిగడ్డ పనులకు మంత్రి వర్గం ఆరు సార్లు ఆమోదం తెలిపిందని చెప్పారు. అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందిందని వెల్లడించారు. ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమిషన్‌కు అందజేశామని, కానీ, కమిషన్‌కు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లను మాకు కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగామని చెప్పారు. అలాగే తాను, సీఎస్, జీఎడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాశానని, కానీ ముగ్గురి నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. అసలు కమిషన్‌కు నిజమైన వివరాలు ఇస్తున్నారా..? లేదా..? అనే అనుమానం వస్తోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. నేడు కూడా అదే ద్రోహం జరుగుతోందన్నారు.
ఉన్న 34శాతం నీటి వాటాలో గతేడాది 28 శాతమే వాడారని, ఆరున్నర లక్షల ఎకరాలు సాగయ్యే 65 టీఎంసీలను ఆంధ్రాకు, చంద్రబాబుకు గురు దక్షిణగా రేవంత్ చెల్లించారని ఆరోపించారు.
కృష్ణా బేసిన్‌లోని 299 టీఎంసీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినది కాంగ్రెస్ పార్టీనే అని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేవలం 42 రోజుల్లోనే కేసీఆర్ కేంద్రాన్ని నీటి పంపిణీ కోసం అడిగారని, కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ ఆ నిజాన్ని దాచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘సీఎం రేవంత్ నీటి పంపకం ట్రిబ్యునల్ పరిధిలో ఉందని స్వయంగా ఓపెన్‌గా అన్నాడు. బోర్డు తాత్కాలికంగా వాటాలను వెల్లడిస్తుందని ఆయన అంగీకరించాడు. ఇప్పుడు అదే విషయాన్ని తాము చెప్పగానే తప్పుగా భావిస్తున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్‌కు బేసిన్‌లు గురించి కనీస అవగాహన లేదు’ అని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా..? లేక చంద్రబాబు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా..? అన్నదే ప్రశ్న అంటూ మాట్లాడారు. బేసిక్‌లు తెలియని వ్యక్తి సీఎం అయ్యారని, నీటి విషయాల్లో కనీస అవగాహన లేని ఉత్తమ్‌ను ఇరిగేషన్ మినిస్టర్ చేశారని.. ఇది రాష్ట్రానికి శాపంగ మారుతందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా నీళ్లలో కేటాయింపులు తాత్కాలికమే అని, 763 టీఎంసీల నీటి కోసం న్యాయవాదులు పోరాడుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. 500, 573 టీఎంసీలు చాలని రేవంత్, ఉత్తమ్ అంటున్నారని, వారు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.


