Saturday, November 15, 2025
HomeTop StoriesAccident: రాపిడో బైక్‌ను ఢీకొట్టిన లారీ.. డాక్టర్‌, డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి

Accident: రాపిడో బైక్‌ను ఢీకొట్టిన లారీ.. డాక్టర్‌, డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి

Greenland Accident: న‌గ‌రంలోని బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ వ‌ద్ద ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రాపిడో బైక్‌ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/pakistan-fire-on-india-and-afghanistan-relation/

ఖమ్మం జిల్లాకు చెందిన ఎం. నవీన్‌ జేఎన్‌టీయూ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ర్యాపిడో నడుపుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విధుల్లో భాగంగా ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్‌ కస్తూరి జగదీశ్ చంద్రను బైక్‌పై సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రీన్‌ ల్యాండ్స్‌ సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టడంతో నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. డాక్టర్‌ జగదీశ్‌ను సోమాజిగూడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also Read: https://teluguprabha.net/national-news/dk-shivakumar-karnataka-cm-post-siddaramaiah-congress/

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ, డ్రైవర్‌ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad