Allakas Grand Open: ఫ్యాషన్ ప్రియులకు గుడ్‌న్యూస్. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లో మరో కొత్త షోరూం ప్రారంభమైంది. బండ్లగూడలోని సన్ సిటీలో ‘అల్లకాస్’ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. సినీతార, ‘ఓజీ’ హీరోయన్ ప్రియాంక్ మోహన్.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేసింది. ప్రియాంక్ మోహన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ‘అల్లకాస్’ ఫౌండర్ అలకా సత్యనారాయణ మాట్లాడారు. వస్త్ర రంగంలో 50 ఏళ్లకి పైగా అనుభవంతో సరికొత్త కలెక్షన్స్, ఫ్యాషన్ ట్రెండింగ్‌తో ‘అల్లకాస్’ దూసుకుపోతున్నట్లు ఆయన అన్నారు. కుటుంబసమేతంగా వచ్చి షాపింగ్ చేసేలా అన్ని రకాల మోడల్స్, నెం. 1 క్వాలిటీతో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ ‘అల్లకాస్’లో దొరుకుతాయని చెప్పారు. ఈ ఫెస్టివ్ సీజన్‌లో రూ. 5000 విలువైన షాపింగ్ చేసే కస్టమర్లకు రూ. 1000 విలువైన గిఫ్ట్ కూపన్‌ను అందిస్తామని సత్యనారాయణ వివరించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-cm-for-speeding-up-land-acquisition/
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


