Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Passport Office:అమీర్‌పేట్.. టోలీచౌకీ పాస్‌పోర్ట్ అఫీసుల అడ్రస్ మార్పు.. ఇవాల్టి నుంచే.. ఎక్కడికి మార్చారంటే..

Passport Office:అమీర్‌పేట్.. టోలీచౌకీ పాస్‌పోర్ట్ అఫీసుల అడ్రస్ మార్పు.. ఇవాల్టి నుంచే.. ఎక్కడికి మార్చారంటే..

Passport Seva Kendra:హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, టోలీచౌకీ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు సెప్టెంబర్ 16, 2025 నుండి తమ ఆఫీసు చిరునామాలకు మార్పులు చేశారు. అమీర్‌పేట్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఇప్పటివరకు ఆదిత్య ట్రేడ్ సెంటర్ వద్ద ఉన్నప్పటికీ.. కొత్తగా దానిని MGBS మెట్రో స్టేషన్ పరిధిలోకి మారింది. ఇదే సమయంలో టోలీచౌకీ పాస్‌పోర్ట్ కేంద్రం కూడా షేక్ పేట్ నాలా పరిధిలోని ఆనంద్ సిలికాన్ చిప్ దగ్గరి నుంచి రాయదుర్గం పాత ముంబై రోడ్ లోని సిరి బిల్డింగ్ వద్దకు బదిలీ అయింది.

- Advertisement -

ఈ మార్పులు పెరుగుతున్న పాస్‌పోర్ట్ అప్లికేషన్ల మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని, సేవల్లో సౌకర్యం, వేగాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తీసుకున్న చర్యగా తెలుస్తోంది. కొత్త కేంద్రాలు మెట్రో ద్వారా సులభంగా చేరుకోగల ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఇది పాస్‌పోర్ట్ సేవలను మరింత సమర్ధవంతంగా అందించేలా చేస్తుందని అధికారులు తెలిపారు.

అప్లికెంట్లకు తెలియజేయకుండానే ఈ మార్పు వలన కొంతసేపు అసౌకర్యం ఎదుర్కోవాల్సి రావడం, అపాయింట్మెంట్ రద్దు చేయడం వంటి సమస్యలు పలువురికి ఎదురయ్యాయి. అందువల్ల అప్లికెంట్లు కొత్త కేంద్రాలకు అపాయింట్మెంట్లు మళ్ళీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమాచారం తెలుసుకుని, పాస్‌పోర్ట్ సేవలకు వెళ్లేటప్పుడు కొత్త చిరునామాలను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మార్పులతో హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ సేవలు మరింత మెరుగైనవిగా, సజావుగా కొనసాగుతాయని ఆశిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా గల్లీ ప్రాంతాల్లోని రద్దీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ కొత్త మార్పులకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా అప్లికెంట్లు పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad