Bar and Restaurant Owners Association: బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధన వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. ఆ జీవోను రద్దు చేయాలని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బార్ యజమానుల సమస్యలపై నాంపల్లి లోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ కమిషనర్‌కు దామోదర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు.
బార్లకు స్టాక్ నిలిపివేత: గతంలో స్టాంప్ డ్యూటీ చెల్లించి అగ్రిమెంట్ చేసుకునే సౌకర్యం ఉండేదని రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు. కానీ ఇప్పుడు రిజిస్ట్రీ తప్పనిసరి చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిపారు. దీంతో బార్లకు స్టాక్ పంపించడం నిలిపివేశారని పేర్కొన్నారు. వైన్స్ షాపుల పర్మిట్ రూమ్‌లు పెద్ద స్థలాల్లో నడపడం వల్ల బార్లకు నష్టం జరుగుతోందని దామోదర్ గౌడ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/tsrtc-bus-ticket-booking-on-google-maps/
వైన్స్ టైమింగ్ మార్చాలని డిమాండ్: హైదరాబాద్‌లో వైన్స్ టైమింగ్ మార్చాలని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లో రాత్రి 10 గంటలకే క్లోజ్ చేస్తుండగా.. సిటీలో మాత్రం 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటున్నాయని అన్నారు. ఇప్పటికే బార్ అండ్ రెస్టారెంట్లు చాలా నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. కొత్త టెండర్లతో ఏర్పడిన వైన్ షాపులను బార్లకు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారని దామోదర్ గౌడ్ అన్నారు. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్‌కు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. వైన్స్‌షాపులకు, బార్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.


