కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanaka Gandhi)పై బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ(BJP) ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్(Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు భారీగా చేరుకుని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.