Friday, January 16, 2026
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్KTR: సనత్‌నగర్‌ టిమ్స్ ఆసుపత్రిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR: సనత్‌నగర్‌ టిమ్స్ ఆసుపత్రిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

Sanathnagar TIMS Hospital: సనత్‌నగర్‌ టిమ్స్ హాస్పిటల్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గత ప్రభుత్వం దూరదృష్టితో తెలంగాణ నలుమూలల మౌలిక సదుపాయాలు విస్తరించాయని పేర్కొన్నారు.

- Advertisement -

మహత్తర ప్రణాళికలో టిమ్స్ భాగం: సనత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలను విస్తరించేందుకు చేపట్టిన మహత్తర ప్రణాళికలో భాగమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఆసక్తికర ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలోనే హైదరాబాద్‌లో నాలుగు టీమ్స్‌ (TIMS) ఆసుపత్రుల ఏర్పాటు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) విస్తరణ పనులు ప్రారంభించిన అంశాన్ని గుర్తుచేశారు. అలాగే వరంగల్‌లో తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులను గత కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన చేసి అమలు చేసిందని వెల్లడించారు. ఇవే కాకుండా బీఆర్‌ఎస్‌ పాలనాకాలంలో 32 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను సైతం ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ గుర్తుకు చేశారు.

Also read-Hyderabad: నగరవాసులకు అలర్ట్.. నేడు, రేపు ఈ ఏరియాల్లో నీటి సరఫరా బంద్!

తుది దశకు సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో, ఆధునిక వసతులతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఈ హాస్పిటల్‌ నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే.. తెలంగాణ వైద్య సేవల్లో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 14 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో 1,000 పడకల సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఈ ఆసుపత్రిని నిర్మిస్తోంది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News