Central Bank of India: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ జోన్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) ఆధ్వర్యంలో వివిధ ఆసుపత్రులలో వైద్యుల సత్కారం కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్స్ డే వేడుకల్లో భాగంగా KIMS హాస్పిటల్ సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి.. MNJ క్యాన్సర్ హాస్పిటల్, నగరంలోని ఇతర ఆసుపత్రుల డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాసులును హైదరాబాద్ జోనల్ హెడ్ శ్రీ. ధరసింగ్ నాయక్. కె సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను ఆయన కొనియాడారు.
హైదరాబాద్ జోన్ పరిధిలోని ఏడుగురు ప్రాంతీయ అధిపతులు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) ఆసుపత్రులను సందర్శించి, వైద్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ జోన్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.