“ మొదటి ప్రయత్నంలో సివిల్స్ సాధించడం ఎలా”అనే సెమినార్ ను అజీజ్ నగర్ లోని విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వింగ్స్ మీడియా, G5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీతో సహకారంతో నిర్వహించారు.
ప్రభావవంతమైన కెరీర్ సాధించాలని
21st సెంచరీ అకాడమీ చైర్మన్ పీ. కృష్ణ ప్రదీప్, మాట్లాడుతూ శివగురు ప్రభాకరన్ అనే ఐఏఎస్ అధికారి గురించి వివరిస్తూ, తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ఎలా అధిగమించి, ఇంజినీరింగ్ పూర్తిచేసి నాలుగో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షలో విజయాన్ని సాధించారో వివరించారు. ప్రజా సేవకు అంకితం అయిన ఆయన, తన గ్రామంలో వారానికి రెండు రోజుల పాటు వైద్య సమస్యలు పరిష్కరించడానికి సేవ చేస్తానని శపథం చేశారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, 2021లో ఒక డాక్టర్ను వివాహం చేసుకున్నారు. విద్యార్థులు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన కెరీర్లను సాధించాలని ఉత్సాహపరిచారు.
ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ
21st సెంచరీ అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవాని శంకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 20 యుపీఎస్సీ ర్యాంకులు సాధించడం తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థులు సోషల్ మీడియాను సరైన విధంగా ఉపయోగించి సివిల్స్ కోసం ప్రిపేర్ కావాలని ఆయన ప్రేరణనిచ్చారు. సెమినార్లో అకాడమీ నిపుణులు రూపొందించిన ప్రత్యేక పుస్తకాలను ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఆర్. వెంకటాచలం (సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్), డాక్టర్ ప్రవీణ్ (ప్లేస్మెంట్ ఆఫీసర్), డాక్టర్ స్రుజనా (కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్), గిరి ప్రకాష్ (వింగ్స్ మీడియా-G5 మీడియా గ్రూప్ డైరెక్టర్), గణేష్ (ఎడిటర్), మరియు మహేష్ (మేనేజర్) హాజరయ్యారు.