Monday, December 9, 2024
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Civils in First attempt: మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా?

Civils in First attempt: మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా?

సివిల్స్ అభ్యర్థులకు దశ-దిశ

“మొదటి ప్రయత్నం లో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా“ అనే సెమినార్ ను కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ లో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, వింగ్స్ మీడియా, G5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించారు.

- Advertisement -

జానకి షర్మిల్ ఐపీఎస్ మా స్టూడెంటే

21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 60 గ్రామాల రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉదాహరణగా ప్రస్తావిస్తూ, జానకి శర్మిల అనే లేడీ ఐపీఎస్ ఆఫీసర్, ఆమెకు సివిల్ సర్వీస్ ద్వారా లభించిన అధికారం, నిర్ణయాలతో ఆ సమస్యను ఎలా పరిష్కరించారో వివరించారు.

జానకి షర్మిల 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ పూర్వ విద్యార్థిని అని చెప్పడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ ఉదాహరణ సివిల్ సర్వెంట్స్ సమాజంలో చూపించే ధైర్య సాహసాలకు నిదర్శనం అని అన్నారు.

పీపీటీ ద్వారా

21st సెంచరీ అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవాని శంకర్ మాట్లాడుతూ సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడం ప్రాముఖ్యతను వివరించారు. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం మాత్రమే కాకుండా, దేశానికి సేవ చేయడంలో ఇది ఒక మార్గమని పేర్కొన్నారు. తన ప్రసంగంలో యూపీఎస్సీ పరీక్షలో అడిగే వివిధ ప్రశ్నలను పీపీటీ ద్వారా విద్యార్థులకు వివరించారు.

గీతాంజలి కాలేజీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసన్న కుమార్, సెమినార్ పై దృష్టి సారించి ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

సివిల్స్ ఆస్పిరెంట్స్ కోసం

ఈ కార్యక్రమంలో భాగంగా సివిల్ ఆస్పిరెంట్స్ క్లబ్ పోస్టర్‌ను డాక్టర్ ప్రసన్న కుమార్, కృష్ణ ప్రదీప్ ఆవిష్కరించారు. ఈ క్లబ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినట్టు కృష్ణ ప్రదీప్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి చైర్మన్ జీ.రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉదయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నవీన్ రామ్, కెరీర్ గైడెన్స్ హెడ్ మంజుల గారు, G5, వింగ్స్ మీడియా గ్రూప్ డైరెక్టర్ గిరి ప్రకాశ్ ఇతర అధ్యాపకులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News