Thursday, December 11, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్CNH- Cyient: అడ్వాన్స్‌డ్‌ ఆటోమేషన్‌ దిశగా.. CNH తో సైయెంట్‌ భాగస్వామ్యం

CNH- Cyient: అడ్వాన్స్‌డ్‌ ఆటోమేషన్‌ దిశగా.. CNH తో సైయెంట్‌ భాగస్వామ్యం

CNH- Cyient Partnership: వివిధ వాహన విభాగాల్లో ప్రపంచ స్థాయి పరికరాలను అందిస్తూ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ CNH కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం.. గ్లోబల్‌ ఇంటిలిజెంట్‌ ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ సైయెంట్‌(Cyient) లిమిటెడ్‌తో గురువారం వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. నిర్మాణ యంత్రాలకు స్వయంప్రతిపత్తి పరిష్కారాలపై దృష్టి సారించినట్లు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో ఆటోమేషన్‌ సామర్థ్యాలను అందించడమే లక్ష్యమని వెల్లడించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-police-corruption-suspension-extortion/

హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ Cyient, CNH మధ్య రెండున్నర సంవత్సరాల సహకారంపై ఈ భాగస్వామ్యం కుదిరింది. జర్ననీలోని మ్యూనిచ్‌లో జరిగిన బౌమా ప్రదర్శనలో ఆవిష్కరించబడిన అడ్వాన్స్‌డ్ పర్సెప్షన్ సిస్టమ్ ఫర్ వీల్ లోడర్స్ డెవలప్‌మెంట్‌.. కీలకమైన పురోగతిగా నిలిచింది. ఈ వ్యవస్థ స్మార్ట్, అటనామస్ నిర్మాణ యంత్రాల తయారీలో CNH కృషిని సూచిస్తుంది. 

Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-it-job-scam-nsn-infotech-fraud/

సైయెంట్‌తో తమ సహకారం స్వయంప్రతిపత్తి వైపు తమ ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాల శక్తిని ప్రదర్శిస్తుందని CNH కన్‌స్ట్రక్షన్స్‌ అధ్యక్షుడు హుమాయున్ చిష్తి అన్నారు. వివిధ వాహన విభాగాల్లో ఈ స్వయంప్రతిపత్తి పరిష్కారాలను స్కేలింగ్ చేయడం, భద్రత, సామర్థ్యం, కార్యాచరణ ఉత్పాదకతలో మెరుగుదల కోసం ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. CNH డొమైన్ నైపుణ్యం, సైయంట్‌లోని ఇంజినీరింగ్‌ నిపుణుల తోడ్పాటు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడిన వాహన విభాగాలను అందించడానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. 

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితాలో ఉన్న CNH ఇండస్ట్రియల్, CASE, న్యూ హాలండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వంటి బ్రాండ్‌ల ద్వారా నిర్మాణ, వ్యవసాయ పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 35,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఇక సైయెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కంటే ఎక్కువ కస్టమర్లకు ఇంజనీరింగ్ పరిష్కారాలను చూపిస్తోంది. 1991లో ప్రారంభమైన ఈ కంపెనీ ఉత్పత్తులు, ప్లాంట్లు నెట్‌వర్క్ రంగాల్లోని క్లయింట్‌లకు సేవలను అందిస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News