Tilak Varma Met CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను సీఎం అభినందించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తిలక్‌ను రేవంత్ రెడ్డి అభినందించి సత్కరించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-by-election/
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తిలక్ వర్మ క్రికెట్ బ్యాట్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. కాగా, తిలక్ వర్మ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు అతడికి ఘన స్వాగతం పలికారు.


