Thursday, January 22, 2026
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Cyient- SCL: మొహాలీ SCLతో హైదరాబాద్‌ Cyient రూ. 4,500 కోట్ల వ్యూహాత్మక ఒప్పందం

Cyient- SCL: మొహాలీ SCLతో హైదరాబాద్‌ Cyient రూ. 4,500 కోట్ల వ్యూహాత్మక ఒప్పందం

Cyient- SCL Project Deal: హైదరాబాద్‌కి చెందిన సైయంట్‌ సెమీ కండక్టర్స్‌ సంస్థ అరుదైన ఘనత సాధించింది. మొహాలీలోని సెమీ-కండక్టర్ లాబొరేటరీ (SCL)తో రూ. 4,500 కోట్ల విలువైన డిజైన్ ఎనేబుల్‌మెంట్‌తో సహా టెక్నాలజీ IPల సరఫరా కోసం కీలకమైన ఒప్పందానికి అర్హత సాధించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సైయంట్‌ సెమీ కండక్ట..ర్స్‌ కస్టమ్ ASIC టర్న్‌కీ, ఇంటెలిజెంట్ పవర్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/operation-kavach-in-friday-midnight-led-by-hyderabad-police-commissioner-sajjanar/

ఈ ఒప్పందం.. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) కింద దేశీయ సెమీకండక్టర్ సామర్థ్యాన్ని విస్తరించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, వ్యూహాత్మక రంగాలకు అందుబాటులో ఉండే తయారీ సామర్థ్యాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. సైయంట్ సెమీకండక్టర్స్ అప్‌గ్రేడ్ చేసిన ఫ్యాబ్‌కు సపోర్ట్‌ ఇచ్చే ప్రాసెస్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను నవీకరించనుంది.

SCLతో సైయంట్‌ వ్యూహాత్మక ప్రాజెక్టు ఒప్పందం.. స్మార్ట్ ఎనర్జీ సెమీకండక్టర్లు, అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల(ASICలు)తో సహా అధిక-వృద్ధి విభాగాలపై దృష్టి సారిస్తుంది. తద్వారా సైయంట్ సెమీకండక్టర్స్, SCL భవిష్యత్తులో విస్తృత శ్రేణి అప్లికేషన్‌లకు మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. 

Cyient- SCL AGREEMENT

తాజా ఒప్పందం ప్రకారం సైయంట్ సెమీకండక్టర్స్.. SCL కోసం మెరుగైన 8-అంగుళాల తయారీ శ్రేణికి మూడు ప్రాథమిక ప్రక్రియ సాంకేతికతలు RF-CMOS, BCD (HV LDMOS), మరియు CMOS ఇమేజ్ సెన్సార్ (CIS)లను సరఫరా చేసి అర్హత సాధిస్తాయి. ఈ టెక్నాలజీ పారిశ్రామిక, ఆటోమోటివ్, ఎనర్జీ, సెన్సింగ్, కనెక్టివిటీ డొమైన్‌లలో విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. ఈ క్రమంలో దేశీయ నోడ్ సెమీకండక్టర్ సామర్థ్యం, ప్రయోజనాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టు దోహదపడనుంది.

Also Read: https://teluguprabha.net/national-news/pil-filed-in-supreme-court-on-indigo-crisis/

ఈ వ్యూహాత్మక ప్రాజెక్టుకు సాంకేతికంగా అర్హత సాధించడం సైయెంట్ సెమీకండక్టర్లకు గర్వకారణం అని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ కృష్ణ బోదనపు అన్నారు. ఇంజినీరింగ్ సామర్థ్యం, ఐపీ పోర్ట్‌ఫోలియో, టర్న్‌కీ అమలు.. తమ కంపెనీ సామర్థ్యాలకు గుర్తింపుగా పేర్కొన్నారు. SCLతో తమ సహకారం భారత సెమీకండక్టర్ స్వావలంబనను వేగవంతం చేస్తుందని ధీమా వ్యక్తం చేసారు. SCL ఆధునీకరణలో ఈ కీలకమైన భాగస్వామ్యానికి అర్హత సాధించినందుకు గర్వంగా ఉందని సీఈఓ సుమన్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. 

సైయంట్ సెమీకండక్టర్స్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. కస్టమ్ ASIC/ASSP సొల్యూషన్స్ ప్రొవైడర్, అనలాగ్ మిక్స్డ్-సిగ్నల్, ఇంటెలిజెంట్ పవర్, అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ ప్లాట్‌ఫామ్‌లపై దృష్టి సారిస్తుంది. భారత్‌, బెల్జియం, యూఎస్‌లలో డిజైన్ కేంద్రాలను కలిగి ఉంది. సైయంట్ సెమీకండక్టర్స్ డేటా సెంటర్లు, రోబోటిక్స్, ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లలో ప్రపంచవ్యాప్త కస్టమర్లకు అధిక సామర్థ్యంతో పాటు వేగవంతమైన టైమ్-టు-మార్కెట్‌ దిశగా సేవలందిస్తోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News