Doctorate to Geetham University Scholar: అడవి మొక్క (భరణి మొక్క)గా పిలిచే ఫెర్న్ జాతి మొక్కల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని గీతం యూనివర్శిటీ ఔషధ శాస్త్ర పరిశోధకురాలు డాక్టర్ టి.శ్రావణి నిరూపించారు. ఈ అరుదైన అడవి మొక్కలో మధుమేహ వ్యాధిని నయం చేసే జౌషధాలు ఉన్నాయని ఆమె చేసిన అధ్యయనంలో తేలింది. అడవి మొక్కలపై జరిపిన పరిశోధనలకు గానూ ఆమెను డాక్టరేట్ వరించింది. గురువారం గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రొఫెసర్ డాక్టర్ పార్థరాయ్ శ్రావణికి డాక్టరేట్‌ను బహుకరించారు. ‘ఫార్మకోగ్నొస్టిక్ స్టడీస్, ఐసోలేషన్ ఆఫ్ ఫైటో-కాన్సిట్యూయెంట్స్ అండ్ బయాలాజికల్ ఇవాల్యుయేషన్ ఆన్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ది ఫెరన్స్’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గానూ ఈ డాక్టరేట్ దక్కింది. ఇప్పటికే ప్రముఖ జర్నల్స్‌లోనూ ఆమె చేసిన రీసెర్చ్ ప్రచురితమైంది. శ్రావణి తన పరిశోధనా వివరాల్ని తెలియజేస్తూ.. అడియాంటం అనే అడవి మొక్క ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. ఈ మొక్క ప్రాచీన కాలం నుంచి ఔషధ తయారీలో ఉపయోగపడుతూ వస్తోందన్నారు. ముఖ్యంగా ఈ మొక్కలో ఉండే టానిన్లు, సాపొనిన్లు, ఆల్కలాయిడ్లు, ఫినోలిక్స్, ఫ్లావనాయిడ్స్ వంటి సెకండరీ మెటబోలైట్స్ వ్యాధి నిరోధక, కాలేయ రక్షణ, గర్భ నిరోధక, జీర్ణ సమస్యల నివారణ, అల్సర్ వ్యతిరేక, జ్వర నివారణ వంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయన్నారు. కాగా, శ్రావణి చేసిన పరిశోధన మధుమేహ వ్యాధి నివారణపై సాగింది. ఈ మొక్కలోని విశేష గుణాలు మధుమేహాన్ని నివారించడంలో ఉపయోగపడతాయని ఆమె రీసెర్చ్‌లో తేలింది. శ్రావణి పరిశోధన ద్వారా ఈ మొక్క వైజ్ఞానికంగా తన ఔషధ విలువను నిరూపించుకుందని, ముఖ్యంగా డయాబెటిస్, అనుబంధ సమస్యల నివారణలో సహాయ పడుతుందని నిరూపితమైంది. ఈ అడవి మొక్కలపై పరిశోధన ద్వారా కొత్త ఔషధాల తయారీకి మార్గం సుగమమైందని ప్రఫెసర్ డాక్టర్ పార్థరాయ్ స్పష్టం చేశారు. శ్రావణి ప్రస్తుతం హైదరాబాద్‌లోని బొటానిక్ హెల్త్ కేర్ అనే సంస్థలో టెక్నికల్ విభాగ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
University Scholar: అడవి మొక్కలో మధుమేహాన్ని నయం చేసే ఔషధ గుణాలు.. గీతం స్కాలర్‌కు డాక్టరేట్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


