Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Dubai Property Expo 2.0: రియల్టర్లకు సువర్ణావకాశం.. హైదరాబాద్‌లో ‘దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2.0’

Dubai Property Expo 2.0: రియల్టర్లకు సువర్ణావకాశం.. హైదరాబాద్‌లో ‘దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2.0’

Dubai Property Expo 2.0 Hyderabad ITC Kohenur: దుబాయ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రియల్టర్లకు ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌.. దుబాయ్‌కి చెందిన ప్రముఖ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ ‘డామాక్‌’తో కలిసి ఏఎక్స్ ప్రీమియం ప్రాపర్టీస్.. హైదరాబాద్‌లో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. అక్టోబర్ 25, 26 తేదీల్లో ఐటీసీ కోహినూర్ వేదికగా ‘దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో 2.0’ని సద్వినియోగం చేసుకోవచ్చు. దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులకు పన్ను నుంచి మినహాయింపు సైతం కల్పిస్తున్నట్లు ‘డామాక్‌’ ప్రతినిధులు పేర్కొన్నారు. అధిక రాబడితో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను, అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-government-warns-employes-to-upload-details-in-ifmis-portal/

డామాక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ప్రస్తుతం 40 కి పైగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-లాంచ్ దశలో రెండు ప్రధాన విల్లాలు, ఫ్లాట్ డెవలప్‌మెంట్‌లతో సహా రూ. 1.5 కోట్ల నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడి ఎంపికలను ఏఎక్స్ ప్రీమియం అందిస్తోంది. వాయిదా పద్ధతిలో చెల్లించడంతో పాటు, బ్యాంక్‌ మార్ట్‌గేజ్‌ రేట్లు కేవలం 3.5 శాతం నుంచే ప్రారంభం కానున్నాయి. కాగా, విదేశాల్లో భారతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో 60 శాతంకి పైగా దుబాయ్ వైపు మళ్లుతున్నాయి. దీర్ఘకాలిక రెసిడెన్సీ, సులభంగా వీసా పునరుద్ధరణ, కుటుంబ సభ్యులు, గృహ సిబ్బంది, డ్రైవర్లను స్పాన్సర్ చేయడానికి అనుమతించే గోల్డెన్ వీసా కార్యక్రమంతో ఈ నగరంపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. 

దుబాయ్ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, పారదర్శకమైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌లలో ఒకటిగా ఉందని ఏఎక్స్ ప్రీమియం ప్రాపర్టీస్ సేల్స్ డైరెక్టర్ సమీక్షా దావులూరి తెలిపారు. పన్ను మినహాయింపుతో పాటు రాబడి బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పో ద్వారా, రియల్‌ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దుబాయ్ మార్కెట్‌లో పెట్టుబడుల ప్రయోజనాలపై హైదరాబాద్ పెట్టుబడిదారుల్లో  అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/mobile-thief-shot-while-attacking-dcp-in-hyderabad/

కాగా, ప్రస్తుతం ఈ డెవలప్‌మెంట్‌లు దక్షిణ దుబాయ్‌లో భాగంగా ఉండగా.. 10.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని సమీక్షా దావులూరి తెలిపారు. 14 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ ప్రాపర్టీ ఎక్స్‌పోల సుదీర్ఘ వారసత్వంతో, ఏఎక్స్ ప్రీమియం.. భారత్‌, దుబాయ్ మధ్య పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేస్తోంది. 

డామాక్ ప్రాపర్టీస్ దుబాయ్‌లోని అతిపెద్ద ప్రైవేట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటి, 40 ఏళ్ల క్రితం దీనిని ప్రారంభించారు. 100 కి పైగా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టులు, ప్రపంచవ్యాప్తంగా 10 కి పైగా దేశాల్లో డామాక్‌ ఉనికిని కలిగి ఉంది.  ఇక, ఏఎక్స్ ప్రీమియం ప్రాపర్టీస్.. దుబాయ్‌లో టాప్ మూడు ఏజెన్సీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ప్రీమియం ఆస్తి అమ్మకాలు, అంతర్జాతీయ ఎక్స్‌పోలు, బహుళ ప్రపంచ మార్కెట్‌ల్లో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad