గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి(Srilatha shoban reddy) తార్నాక డివిజన్‌లోని మల్టీ పర్పస్ హాల్ పనులను పరిశీలించారు. ఆమె వెంట టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్, జీహెచ్ఎంసి అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మల్టీ పర్పస్ హాల్ పనుల నాణ్యతతో పాటు నిర్మాణం పూర్తిచేసే గడువుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను కూడా తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు.
పనులు నాణ్యతగా ఉండాలని.. అలాగే నిర్మాణాలు సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.