Gold Seize at Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్సులో 3.38 కిలోల బంగారాన్ని దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 3.36 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -
Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/value-zone-store-in-ameerpet/
ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకువచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం తరలింపునకు సంబంధించి సరైన ధృవపత్రాలు లేవని వెల్లడించారు. కాగా విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చిన ముగ్గురు నిందితులు ఆంధ్రప్రదేశ్‌క్ చెందిన వారిగా సమాచారం.


