Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad | అద్దె కట్టలేదని యువతిపై ఇంటి యజమాని దారుణం

Hyderabad | అద్దె కట్టలేదని యువతిపై ఇంటి యజమాని దారుణం

హైదరాబాద్(Hyderabad) అత్తాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దె కట్టలేదని ఓ కుటుంబంపై ఇంటి యజమాని దాష్టీకానికి ఒడిగట్టాడు. కత్తితో దాడికి దిగాడు. ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న యువతికి తీవ్ర గాయావగా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే…

- Advertisement -


అత్తాపూర్ హసన్ నగర్ లో ఒక కుటుంబం అద్దె ఇంట్లో ఉంటోంది. గత కొంతకాలంగా ఇంటి అద్దె చెల్లించకుండా కాలం గడుపుతున్నారు. దీనిపై ఇంటి యజమానికి, అద్దెకి ఉంటున్న వారికి తరచూ గొడవలు అవుతున్నాయి. విసిగిపోయిన ఇంటి యజమాని అద్దెకి ఉంటున్నవారి ఇంటికి పవర్ కట్ చేశాడు. దీనిపై యజమానికి, అద్దెకి ఉంటున్న కుటుంబానికి వాగ్వాదం చెలరేగింది. సదరు కుటుంబం ఇంటి యజమానిపై దురుసుగా ప్రవర్తించడంతో వారిపై కత్తితో దాడికి దిగాడు. ఘటనలో అద్దెకి ఉంటున్న కుటుంబంలోని యువతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad