మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో 21st సెంచరీ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధ్యమంటూ విద్యార్థులకు వివరించారు. మొదటి ప్రయత్నంలోనే విద్యార్థులు సివిల్స్ సాధించడం అంత కష్టమేమీ కాదని 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. సోమవారం మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాలలో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, వింగ్స్ మీడియా, G5 మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పాలనా రంగంలో డాక్టర్ల మార్కు ఇలా ఉంటుందని
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్, డాక్టర్లు ఎలా పరిపాలనా రంగంలో విశేషంగా రాణించగలరో తెలియజేస్తూ డాక్టర్ దారేజ్ అహ్మద్ అనే ఎంబిబిఎస్ గ్రాడ్యుయేట్ జిల్లా కలెక్టర్‌గా మారి, చైల్డ్ మ్యారేజెస్ నివారణ ద్వారా ప్రజారోగ్యంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన ఉదాహరణను వివరించారు. మెడికల్ సైన్స్‌ను ఐచ్ఛిక విషయంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచిస్తూ, ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం అని ప్రాముఖ్యతను వివరించారు.
మహిళా శక్తి అస్సలు తక్కువ కాదు
అనంతరం చీఫ్ మెంటర్ భవాని శంకర్ మాట్లాడుతూ మహిళా శక్తి తక్కువేమీ కాదని దానికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఇందులో భాగంగానే నారి శక్తి ద్వారా ప్రభుత్వం వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రవేశ సమయంలో మహిళలకు ఫీజులో ప్రత్యేక రాయితీ ఉంటుందని కానీ సమాన అవకాశం కల్పిస్తుందని, మహిళలకు ప్రత్యేక హోదా కూడా ఉంటుందని ఈ అవకాశంతో సివిల్స్ సాధించడం సులభం అవుతుందని సూచించారు. ఈ సందర్భంగా 21 సెంచరీ ప్రత్యేకంగా రాసిన పుస్తకాలను ప్రారంభించి లైబ్రరీకి అందించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు, డీన్ డాక్టర్ శ్రీలత, ఛాన్సలర్ డాక్టర్ సుధా రమణ, గిరి ప్రకాష్, ఎడిటర్ గణేష్, ప్రసాద్ పాల్గొన్నారు.