సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్-సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో అశోకా వన్ మాల్ జాతీయ రహదారి భద్రతా మాస అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సురక్షితమైన డ్రైవింగ్, ట్రాఫిక్ మార్గదర్శకాలను పాటించే సంస్కృతిని పెంపొందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు నుండి వెంకటయ్య, ముత్తు యాదవ్, సీఐ, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నుండి నిషా పాల్గొన్నారు.
‘నుక్కడ్’ బాధ్యత
సురక్షిత ప్రయాణం పౌరులందరి హక్కని, ఇది సాకారం కావాలంటే రోడ్డుపైన సమిష్టి బాధ్యత వహించాలన్నారు. మెరిడియన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ట్రాఫిక్ చర్యలపై నుక్కడ్ నాటకాన్ని ప్రదర్శించారు, రోజువారీ దృశ్యాలను నైపుణ్యంగా వర్ణించారు. రహదారిపై బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రాముఖ్యత నొక్కిచెప్పారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/01/2f97452c-d465-497b-bd2a-469adda70d1b-1-1024x585.jpg)
అశోక డెవలపర్స్
ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, “అశోకా వన్ మాల్‌లో, రహదారి భద్రత అనేది ప్రతి వ్యక్తి, సంఘం, అధికారం ప్రమేయం అవసరమని భాగస్వామ్య బాధ్యత అని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా, సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను అవలంబించేలా, ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడం ద్వారా శాశ్వతమైన మార్పును సృష్టించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.