Saturday, January 18, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyd numaish: నుమాయుష్ లో లేడీస్ జోష్

Hyd numaish: నుమాయుష్ లో లేడీస్ జోష్

ఫన్ టైం ప్లస్ బిజినెస్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నుమాయుష్ లో మహిళలు పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో నుమాయుష్ ను సందర్శించారు. మహిళల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యేకమైన స్ట్రాల్స్ కొలువుదిరాయి.

- Advertisement -

స్ట్రాల్స్ సూపర్ కలెక్షన్
నుమాయుష్ లో ఏర్పాటు చేసిన లేడీస్ స్పెషల్ స్ట్రాల్స్ లలో అనేక రకాల ఫ్యాబ్రిక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో అంటే కేవలం వస్తువుల ప్రదర్శన మాత్రమే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కలిసి సరదాగా గడుపుకునే ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. లేడీస్ కోసం ఎగ్జిబిషన్‌లలో అన్ని రకాల వస్తువులు లభ్యమవుతున్నాయి. దీంతో మహిళలు తమకు నచ్చిన దుస్తులు, ఆభరణాలు, ఇంటి అలంకరణ వస్తువులు మొదలైనవి కొనుగోలు చేయడానికి ఇష్టపడతున్నారు.


ఎగ్జిబిషన్‌ లో కుటుంబ సభ్యులందరికీ కలిసి గడుపుకునే అవకాశాన్ని కల్పిస్తుందని పలువురు తెలిపారు. పిల్లలు ఆడుకోవడానికి, యువత స్నేహితులతో కలిసి తిరగడానికి, వృద్ధులు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రాంతంగా మారింది. కుటుంబంతో సహా కలిసి తిను బండారాలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు.

మెప్మా బజార్ చూశారా?
నుమాయుష్ లో పట్టణ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన ( మెప్మా బజార్) లో మహిళలకు తమ చేతి వృత్తులను ప్రదర్శించి అమ్ముకునే వీలుగా నుమాయుష్ మంచి వేదికగా తయారైంది. నారాయణపేట పట్టు చీరలు, ధర్మవరం, కంచి, చేనేత వస్త్రాలు నైటీలు, కుర్తా , లుంగీలు, మహిళలు స్వయంగా చేతితో అల్లిన వస్త్రాలు ప్రదర్శనలో ఉంచారు.
తమ చేతివృత్తులను ప్రదర్శించి అమ్మడం ద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. నుమాయుష్ లో నెలకొన్న సందడి వాతావరణంలో
మహిళలకు ఒత్తిడి నుండి విముక్తిని కలిగిస్తూ.. మహిళలకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతికంగా అభివృద్ధి చెందే అవకాశాలను కలిగిస్తున్నాయి.

ఉమర్ ఖాన్, స్టాల్ నిర్వాకుడు, నుమాయిష్

“కాశ్మీర్ కు చెందిన గోల్డెన్ సిల్క్ హౌస్ లో రకరకాల బట్టలు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్సీ సారీస్, ఫ్యాన్సీ కుర్తా, పంజాబీ డ్రెస్, షాల్స్ తదితర దుస్తులు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు ఉమార్ ఖాన్ తెలిపారు. ప్రత్యేకంగా సొంతంగా కాశ్మీర్ లో తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. తమకు నుమయుష్ లో రెగ్యులర్ కస్టమర్ ఉన్నారని తెలిపారు. థాయిలాండ్, అబుదాబి, మస్కట్ తదితర దేశాలలో ఎగ్జిబిషన్ లో పాల్గొని కాశ్మీర్ దుస్తులను విక్రయించి”నట్లు చెప్పారు.

సయ్యద్ ఖాన్, షాప్ నిర్వాహకుడు, నుమాయిష్
తమ పూర్వీకుల నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుమయుష్ లో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . ప్రపంచ వ్యాప్తంగా తమ వస్తువులకు డిమాండ్ ఉన్నట్లు వివరించారు. నాణ్యమైన బట్టలను తక్కువ ధరకే హైదరాబాద్ ప్రజలకు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నారు. ప్రతిఏటా హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆనందంగా గడుపుతామని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News