మెహిదీపట్నంలోని జి . పుల్లారెడ్డి హైస్కూల్, లో “10వ తరగతికి తర్వాత ఏం చదవాలి ” అనే శీర్షికతో ఒక ఉపయోగకరమైన సెమినార్ను వింగ్స్ మీడియా, G5 మీడియా గ్రూప్ వారు 21st సెంచరీ ఎడ్యుకేషనల్ అకాడమీ సహకారంతో నిర్వహించారు. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు 10వ తరగతి తర్వాత ఉన్న వివిధ విద్యా అవకాశాలను గురించి వివరంగా తెలిపారు.
ఫోర్ ‘సీ’లుంటే క్లారిటీ వస్తుంది
21st సెంచరీ ఎడ్యుకేషనల్ అకాడమీ ఛైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ , విద్యార్థులు తమ బలాలు, బలహీనతలను గుర్తించి, సమర్థమైన విద్యా, ఉద్యోగ ఎంపికలు చేసుకోవాలని సూచించారు. వారు సినిమా,సెల్ ఫోన్‌లను దూరంగా ఉంచి, 4 C’s అని చెప్పుకునే సందర్భం, సంకల్పం, పరిణామాలు, మరియు సమకాలీనతను కలిగి ఉండాలని సూచించారు. డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ ఐఐటీ, నీట్ కాకుండా విద్యార్థులకు ఉన్న ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాల గురించి వివరించారు. సీఎల్ఏటీ, సీయుఈటీ, ఐపీఎంఏటీ వంటి కోర్స్ చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలను ఉంటాయని చెప్పారు. విద్యార్థులు గణితం, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ మీద శ్రమ పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సంగీతా, వింగ్స్ మీడియా డైరెక్టర్ గిరి ప్రకాష్, ఎడిటర్ గణేష్, మేనేజర్స్ మహేష్, ప్రసాద్ పాల్గొన్నారు.