Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Adulteration Alert: మీరు తాగేది టీ నా? రంగు నీళ్లా?.. జీహెచ్‌ఎంసీ దాడుల్లో విస్తుపోయే నిజాలు!

Adulteration Alert: మీరు తాగేది టీ నా? రంగు నీళ్లా?.. జీహెచ్‌ఎంసీ దాడుల్లో విస్తుపోయే నిజాలు!

Adulterated tea powder in Hyderabad :  ఉదయాన్నే… లేచిందే మొదలు ఒక కప్పు ఘరం ఘరం వేడి ఛాయ్ తాగనిదే చాలామందికి పూట గడవదు. కానీ, మీరు ఎంతో ఇష్టంగా తాగే ఆ టీలో హానికరమైన రంగులు కలిశాయని తెలిస్తే? హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వహించిన దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలు ఇప్పుడు నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అసలు ఈ కల్తీ దందా ఏంటి…? స్వచ్ఛమైన టీ పొడిని, కల్తీ పొడిని ఎలా గుర్తించాలి..?

- Advertisement -

రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ : హైదరాబాద్ నగరంలోని పలు టీ స్టాళ్లలో కల్తీ టీ పొడి వాడుతున్నారన్న పక్కా సమాచారంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నగరంలోని 42 టీ పొడి యూనిట్లు, టీ స్టాళ్లపై ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

నమూనాల సేకరణ: ఈ తనిఖీల సందర్భంగా అధికారులు 19 వేర్వేరు ప్రాంతాల నుంచి టీ పొడి నమూనాలను సేకరించారు.

ల్యాబ్‌కు తరలింపు: సేకరించిన నమూనాలను నాణ్యత, కల్తీ నిర్ధారణ పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కల్తీని గుర్తించడం ఎలా : ల్యాబ్ రిపోర్టులు వచ్చేలోపు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ టీ పొడిని సులభంగా గుర్తించవచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కేవలం రెండు నిమిషాల్లో మీ ఇంట్లోనే ఈ చిన్న పరీక్ష చేసుకోవచ్చు.

తడి గుడ్డతో పరీక్ష: కొద్దిగా టీ పొడిని తీసుకుని, ఒక తడి బట్టపై వేసి రుద్దండి. టీ పొడి స్వచ్ఛమైనది అయితే, బట్టకు ఎలాంటి రంగు అంటదు. అదే కల్తీ టీ పొడి అయితే, వెంటనే బట్టపై రంగు మరకలు ఏర్పడతాయి.

చల్లని నీటితో పరీక్ష: ఒక గ్లాసు చల్లని నీళ్లు తీసుకుని, అందులో ఒక చెంచా టీ పొడి వేయండి. స్వచ్ఛమైన కల్తీ లేని టీ పొడి అయితే, రంగు నెమ్మదిగా వాటర్లో కలుస్తుంది. అదే కల్తీ టీ పొడి అయితే, నీటిలో వేయగానే తక్షణమే ముదురు ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారిపోతుంది.

అధికారుల హెచ్చరిక : ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా కల్తీ జరుగుతున్నట్లు ఆధారాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు బయట టీ తాగేటప్పుడు పరిశుభ్రత పాటించే దుకాణాలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ ధరకు లభించే నాసిరకం టీ పొడి వాడకం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad