Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో భారీ వర్షాలు.. కారుతో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో భారీ వర్షాలు.. కారుతో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

Hyderabad Heavy Rains : హైదరాబాద్ లో భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ వరదలో బైక్స్, కార్లు సైతం కొట్టుకుపోయాయి. ఇక ఓ వ్యక్తి కారుతో సహా కొట్టుకుపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

హైదరాబాద్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు జలమయమై, చెరువులను తలపించాయి. జూబ్లీహిల్స్, మణికొండ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, తార్నాక, ఉప్పల్, మేడిపల్లి వంటి ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన బీభత్స వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది క్లౌడ్ బరస్ట్‌గా అధికారులు గుర్తించారు.

ALSO READ : TG Weather updates: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తత అవసరం..!

వరదలతో చెరువును తలపించిన రోడ్లు.. 

వర్షం ఒక్కసారిగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని కృష్ణనగర్‌లో ఒక వ్యక్తి బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయాడు. మణికొండలోని లాంకో హిల్స్‌లో కార్లు, తోపుడు బండ్లు వరద నీటిలో కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాత బస్తీలో మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు రాత్రి వరకు వర్షంలో చిక్కుకున్నారు.

జలాశయాలు నిండు కుండలుగా…

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. మూసి నది పరివాహక ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు

ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో వర్షం బీభత్సం సృష్టించడంతో చాలామంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు స్తంభించాయి. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఒక్కసారిగా కురిసిన వర్షం నగరాన్ని స్తంభింపజేసింది.

ఈ భారీ వర్షాలు హైదరాబాద్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad