Thursday, March 27, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad: మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పై సెమినార్

Hyderabad: మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పై సెమినార్

ఆల్ ఇండియా సర్వీసెస్..

21st సెంచరీ ఐఎఎస్ అకాడమీ సహకారంతో వింగ్స్ మీడియా, జి 5 మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మొయినాబాద్లోని J.B. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (JBIET) లో మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసులను ఎలా క్రాక్ చేయాలి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

- Advertisement -

కలెక్టర్ పమేలా సత్పతి సంకల్పమే ఉదాహరణ

21st సెంచరీ ఐఎఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ విద్యార్థులతో మాట్లాడుతూ కరీంనగర్ ప్రస్తుత కలెక్టర్ పమేలా సత్పతి గురించి వివరిస్తూ ఆమెను పాఠశాల రోజుల్లో ఆమె సహచరులు ఎలా తక్కువ చేసి చూసారో, దానికి ఆమె పట్టుదల మరియు అంకితభావంతో, ఈ సవాళ్లను అధిగమించి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఏలా విజయం సాధించిందో ఒక ఉదాహరణగా తెలిపారు. ఆమె రూర్కీకి చెందినవారని, సంపూర్ణ సంకల్పం ద్వారా కలెక్టర్ అయ్యారని పేర్కొంటూ ప్రదీప్ ఆమె గురించి వివరించారు.

అపోహలు తోసిపుచ్చిన భవానీ శంకర్

21st సెంచరీ ఐఎఎస్ అకాడమీ చీఫ్ మెంటర్, డైరెక్టర్ డాక్టర్ భవానీ శంకర్ యుపిఎస్సి విజయం ఉన్నత సంస్థల విద్యార్థులకు మాత్రమే పరిమితమైందనే అపోహను తోసిపుచ్చారు. సరైన వ్యూహం, అంకితభావం మరియు పట్టుదలతో విజయం సాధించొచ్చు అని అన్నారు.

యుపీఎస్సీ క్లబ్ స్టార్ట్

జేబీఐఈటీ ప్రిన్సిపాల్ డాక్టర్ P.C. కృష్ణమాచారి విద్యార్థులు ఈ సెమినార్ ను సద్వినియోగం చేసుకోవాలని, కాలేజ్ లో యుపిఎస్సి సివిల్ ఆస్పిరెంట్స్ క్లబ్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. 21st సెంచరీ ఐఎఎస్ అకాడమీకి చెందిన నిపుణులు రచించిన పుస్తకాలను ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ జే.వి. కృష్ణ రావు, డాక్టర్ ఎం. ఆసిఫ్ (కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ & TPO) డాక్టర్ నరసప్ప రెడ్డి (HOD-ECM) డాక్టర్ హిమాన్షు శర్మ (డీన్-అడ్మిన్) డాక్టర్ వెంకట కృష్ణ (డీన్-CS) గిరి ప్రకాష్ (డైరెక్టర్, వింగ్స్ మీడియా-G5 మీడియా గ్రూప్) గణేష్ (ఎడిటర్) మహేష్ (మేనేజర్) అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News